Today Rasi Phalalu: నేడు ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు.. మీరున్నారా?
ప్రతిరోజు మన జీవితంలో ఏం జరుగుతుంది? మన రాశి ఫలం ఎలా ఉంది? అని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.. నవంబర్ 24 సోమవారం నాడు 12 రాశుల ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వ్యక్తిగత జీవితాలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనేది తెలుసుకుందాం.
మేషరాశి
మేషరాశి జాతకులు ఈరోజు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. మేష రాశి వారికి ఈ రోజు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మేషరాశి జాతకులు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన పనులలో పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యంగా ఉంటారు.
మిధున రాశి
మిధున రాశి జాతకులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బద్ధకాన్ని వదిలిపెట్టి కష్టపడే వారికి మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. పనిచేసే చోట ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి మిధున రాశి జాతకులు నేడు జాగ్రత్తగా వ్యవహరించాలి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఈరోజు మీకు ఆర్థికంగా లాభం చేకూరుతుంది. కష్టపడి పనిచేసే వారికి మంచి పేరు వస్తుంది. అయితే శత్రువుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
సింహరాశి
సింహరాశి జాతకులు నేడు సానుకూల ఫలితాలను పొందుతారు. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది వీరికి మంచి సమయం. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. శారీరకంగాను మానసికంగాను ఫిట్ గా ఉంటారు.
కన్యారాశి
కన్య రాశి జాతకులు ఈరోజు సమాజంలో మంచి గుర్తింపును పొందుతారు. వ్యాపారాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. చిరాకులు తొలగిపోతాయి. అనుకున్న పనులు జరుగుతాయి.
తులారాశి
తులా రాశి జాతకులకు ఈరోజు సమస్యలు పరిష్కారమవుతాయి. ఇల్లు, వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ నాయకులకు, కళాకారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అన్ని విషయాలలోనూ ప్రోత్సాహకరంగా ఉంటుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులు ఈరోజు వివాదాల నుంచి బయటపడతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేసే వారికి బాగుంటుంది. ఈరోజు శుభవార్తలు వింటారు. అనుకోని విధంగా సొమ్ము చేతికందుతుంది.
ధనస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులకు ఆదాయం పెరుగుతుంది. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు, పారిశ్రామికవేత్తలు సానుకూల ఫలితాలను పొందుతారు. సమస్యలు పరిష్కారమవుతాయి. బంధుమిత్రుల సహకారం అందుతుంది.
మకర రాశి
మకర రాశి జాతకులకు పనులలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. ఈరోజు మకర రాశి జాతకులు ఒత్తిళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. పని పైన శ్రద్ధ పెట్టి చేయాలి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.
కుంభరాశి
కుంభ రాశి జాతకులకు పనులలో కొంత జాప్యం జరుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. కుంభ రాశి వారు నేడు శుభవార్తలు వింటారు. పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్లే అవకాశం ఉంది.
మీనరాశి
మీన రాశి వారికి నేడు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా మారుతాయి. మీన రాశి వారి ఆర్థిక పరిస్థితి నేడు మెరుగుపడుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
గమనిక: ఇవి సాధారణ రాశి ఫలాలు మాత్రమే. మీ వ్యక్తిగత జాతకం మరియు ఇతర గ్రహాల స్థితిగతులను బట్టి ఫలితాలలో మార్పులు ఉండవచ్చు. మరింత ఖచ్చితమైన వివరాల కోసం నిపుణులను సంప్రదించండి.












Click it and Unblock the Notifications