Today Rasi Phalalu:నేడు శుభయోగాలతో వీరింట సంపదల పండుగ!
నవంబర్ 23 ఆదివారం నాడు, తిథి తృతీయ. మూల నక్షత్రం. ఈరోజు గాండా మూల, సర్వార్ధ సిద్ధి యోగం, రవి యోగం, విథాల యోగం ఏర్పడుతున్నాయి. ఈ యోగాలు ద్వాదశ రాశుల వారి జీవితాలను నిర్ణయిస్తాయి. ఈరోజు ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం
మేషరాశి
మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థికంగా ఈ సమయం వీరికి కలిసొస్తుంది.

వృషభ రాశి
వృషభ రాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి, వాటిని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
మిధున రాశి
మిధున రాశి జాతకులు ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి వచ్చే అవకాశం ఉంది ఆర్థిక లాభాలు ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిధున రాశి వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో కాస్త ఇబ్బందులను ఎదుర్కొంటారు. కొంచెం సవాళ్లతో కూడుకున్న పరిస్థితులు ఉంటాయి. పనులలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది సహనంతో వ్యవహరించడం ముఖ్యం. ఆధ్యాత్మిక చింతన మనశ్శాంతిని ఇస్తుంది.
సింహరాశి
సింహ రాశి వారు పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం బాగుంటుంది. స్నేహితులతో ఈ సమయంలో సరదాగా గడుపుతారు.
కన్యారాశి
కన్యారాశి జాతకులు కుటుంబాలలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. ఇది కన్యా రాశి వారికి శుభ తరుణం.
తులారాశి
తులా రాశి జాతకులకు ఈరోజు గౌరవ, ప్రతిష్టలు పెరుగుతాయి. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. శత్రువుల పైన విజయం సాధిస్తారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రణాళికబద్ధంగా పనులను పూర్తి చేసుకుంటారు.
ధనుస్సు రాశి
ధనస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త చేయడం మంచిది కాదు. ఆర్థిక విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
మకర రాశి
మకర రాశి వారికి కొత్త వ్యాపార ఆలోచనలు వస్తే వాటిని అమలు చేయడానికి ఇది మంచి సమయంగా ఉంటుంది. ఆర్థికంగా మకర రాశి జాతకులు లాభాలు పొందుతారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది.
కుంభ రాశి
ఈరోజు కుంభ రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది.
మీన రాశి
ఈరోజు మీన రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. అనుకోని ధన లాభం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యమైన వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు మీకు లాభాలను కలుగజేస్తాయి.
గమనిక: ఇవి సాధారణ రాశి ఫలాలు మాత్రమే. మీ వ్యక్తిగత జాతకం మరియు ఇతర గ్రహాల స్థితిగతులను బట్టి ఫలితాలలో మార్పులు ఉండవచ్చు. మరింత ఖచ్చితమైన వివరాల కోసం నిపుణులను సంప్రదించండి.












Click it and Unblock the Notifications