Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

today rashi phalalu: నేడు సూర్యుడి దయతో వీరింటికి లక్ష్మీదేవి నడిచివస్తుంది!

జనవరి 11, 2026 ఆదివారం నేడు. గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి నేడు అనేక శుభ ఫలితాలు అశుభ ఫలితాలు రాబోతున్నాయి. సూర్యుడు మకరరాశిలో, బుధుడు ధనుస్సు రాశి ప్రభావంలో, గురు శుభదృష్టితో ఉంటారు. ఈరోజు ముఖ్య గ్రహాల సంచారం కారణంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబ విషయాల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం.

మేష రాశి
మేష రాశి జాతకులకు ఈ రోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. నేడు ఆర్థికంగా కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మేషరాశి జాతకులు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

today rashi phalalu with sun blessings these zodiac signs will get huge wealth and happiness

వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు నేడు ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ అవసరమైన పనులకే వ్యయం చేయడం మంచిది. వీరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మాటల్లో సంయమనం అవసరం.

మిథున రాశి
మిధున రాశి వారికి మిత్రుల సహకారం లభిస్తుంది. వ్యాపారాల్లో లాభ సూచనలు ఉన్నాయి. ఈరోజు ఏర్పడే కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ప్రయాణ యోగం ఉంది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. అధికారి వర్గం నుంచి ప్రశంసలు పొందుతారు. నేడు వీరి కుటుంబంలో శుభకార్య చర్చలు జరుగుతాయి.

సింహ రాశి
సింహ రాశి వారికి నేడు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించి తీసుకోవడం అవసరం.

కన్య రాశి
కన్యా రాశి జాతకులకు నేడు అనుకోని ధనలాభం కలగవచ్చు. అప్పులు తీర్చే అవకాశం ఉంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కన్యా రాశి వారు భావోద్వేగాలను నియంత్రించాలి.

తుల రాశి
తులా రాశి జాతకులకు దాంపత్య జీవితంలో ఆనందం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలకు తులా రాశి వారికి ఇది మంచి రోజు. కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి నేడు పనిభారం ఎక్కువైనా ఫలితం సంతృప్తినిస్తుంది. ఆరోగ్య సమస్యలు చిన్నవిగా ఉండే అవకాశం ఉంది. నేడు వీరికి విశ్రాంతి అవసరం.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకుల సృజనాత్మక ఆలోచనలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. పిల్లల విషయాల్లో శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది.

మకర రాశి
మకర రాశి వారు నేడు ఇంటి విషయాల్లో శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆస్తి సంబంధిత చర్చలు సాగుతాయి. సహనం పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

కుంభ రాశి
కుంభ రాశి వారికి నేడు నైపుణ్యం మెరుగవుతుంది. మీడియా, కమ్యూనికేషన్ రంగాల వారికి లాభదాయకమైన రోజు. ప్రయాణాలు లాభాలను ఇస్తాయి

మీన రాశి
మీన రాశి వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంతో ఆనందంగా ఈరోజు గడపవచ్చు.

ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+