Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

today rashiphalalu: ఈ రాశులవారిపై కుజ శుక్రుల ప్రభావం.. వీరికి అదృష్టం!

ఫిబ్రవరి 16, 2026 సోమవారం గ్రహస్థితులు కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉండగా, మరికొన్ని రాశుల వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. శివరాత్రి తెల్లారే సూర్యుడు కుంభరాశిలో సంచరిస్తుండగా, బుధుడు కూడా కుంభరాశిలోనే ఉండటం వల్ల కొన్ని రాశులవారికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ఫిబ్రవరి 16న వివిధ రాశులలో గ్రహాల సంచారం

మకర రాశిలో కుజుడు మరియు శుక్రుడు సంచారం చేస్తున్నారు. దీని ప్రభావం కొన్ని రాశులకు శుభ ఫలితాలు ఇస్తుంది.. ప్రేమ, సంబంధాల విషయంలో కూడా శుక్రుడు అనుకూల ఫలితాలను ఇవ్వగలడు. అయితే కుజుని ప్రభావంతోగ్రహాల సంచారం ఇలా కొంత ఆవేశం పెరిగే అవకాశం ఉంది కాబట్టి నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి.

Today s horoscope These zodiac signs are influenced by Mars and Venus Good luck to them

శని మీనరాశిలో సంచారంతో వారికి లబ్ది

గురుడు వృషభ రాశిలో సంచరిస్తూ ఆర్థికాభివృద్ధి, స్థిరాస్తి లాభాలకు మార్గం సుగమం చేస్తున్నాడు. శని మీన రాశిలో సంచారం చేస్తూ అన్ని రాశులవారిపై ప్రభావాన్ని చూపిస్తున్నాడు. చంద్రుడు ఈ సమయంలో మీన రాశిలో ఉండటం వల్ల భావోద్వేగాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.

మేష రాశి

మేషరాశి వారికి ఈ రోజు శుభవార్తలు అందే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ముందడుగు పడుతుంది.నేడు వీరికి అన్ని విషయాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి.

వృషభ రాశి

వృషభరాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. నేడు ముఖ్యమైన పనులు పెట్టుకోకూడదు.

మిథున రాశి

మిధునరాశి వారికి స్నేహితుల సహకారం లభించి కొత్త అవకాశాలు కలుగుతాయి. నేడు వీరు ఏ పని చేసినా శుభం కలుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభం వస్తుంది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి జాతకులకు నేడు చాలా విషయాలలో జాగ్రత్తగా ఉండటం అవసరం. వీరు ఏ పని చేసినా నేడు అనుకూలంగా ఉండదు. వారు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.

సింహ రాశి

సింహరాశి జాతకులకు కార్యరంగంలో ప్రశంసలు వస్తాయి. నేడు వీరికి పదోన్నతి సూచనలు కనిపిస్తున్నాయి. ఏ పని చేసినా వీరికి కలిసి వస్తుంది.

కన్యా రాశి

కన్య రాశివారికి ప్రయాణ యోగం ఉంది. అనుకున్న పనులు సానుకూలంగా అవుతాయి. అయితే ఆర్ధిక విషయాలలో కాస్త జాగ్రత్త

తుల రాశి

తులారాశి వారు కుటుంబ విషయాల్లో సహనంతో వ్యవహరించాలి. నేడు నోరు అదుపులో పెట్టుకోవాలి . ఏ పని చేసినా వీరు ఆలోచించి చెయ్యాలి

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి జాతకులకు నేడు దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది. ఏ పని చేసినా వృశ్చిక రాశి వారు శుభ ఫలితాలను చూస్తారు.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి పనుల్లో ఆలస్యం జరిగినా చివరికి విజయం సాధిస్తారు. నేడు అన్ని విధాలా ధనుస్సు రాశి వారికి మంచి జరుగుతుంది. కానీ పనిలో శ్రద్ధ అవసరం.

మకర రాశి

మకర రాశి వారికి నేడు వారికి ఆర్థిక లాభ సూచనలు ఉన్నాయి. నేడు వీరికి కలిసి వస్తుంది. అన్ని పనుల్లో ఊహించని ఆర్ధిక లాభాలు పొందుతారు.

కుంభ రాశి

కుంభరాశి జాతకులకు వ్యక్తిగత విషయాల్లో స్పష్టత అవసరం. ఏ పని చేసినా వీరికి నేడు విజయ లక్ష్మి వరిస్తుంది, కానీ ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాలి,.

మీనరాశి

మీన రాశివారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నేడు మీనరాశి జాతకులు సానుకూల ఫలితాలు పొందుతారు.

గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు. వ్యక్తిగత జాతకాలను బట్టి ఫలితాలు మారవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+