today rashiphalalu: నేడు శుక్రుడి ప్రేమతో ఈ రాశులవారి జీవితంలో అద్భుతం జరుగుతుంది
ఫిబ్రవరి 14 2026.. ఈరోజు వాలెంటైన్స్ డే.. ప్రేమికుల ప్రేమికుల దినం జరుపుకునే రోజు. అయితే ఈ రోజున గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు వస్తుండగా మరికొన్ని రాశుల వారు అశుభ ఫలితాలను చూస్తారు. సూర్యుడు కుంభరాశిలో సంచరిస్తుండగా, బుధుడు కూడా సూర్యుడు సంచరిస్తున్న కుంభరాశి లోనే ఉన్నాడు.
గ్రహ సంచారాలు.. రాశి ఫలాలు
చంద్రుడు మీన రాశిలో ఉన్నాడు. ఇక శుక్రుడు శతభిషా నక్షత్ర ప్రభావంలో ఉండగా, గురుడు వృషభ రాశిలో కొనసాగుతున్నాడు. శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ ముఖ్య గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కొన్ని రాశులకు నేడు శుభ ఫలితాలు వస్తాయి.

మేషం
మేషరాశి జాతకులు నేడు ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. వీరికి ఆర్థిక లాభాలు కలుగుతాయి. మేషరాశి జాతకుల కుటుంబంలో ఆనందం ఉంటుంది.
వృషభం
వృషభ రాశి జాతకులు గురుగ్రహ అనుగ్రహంతో శుభవార్తలు వినే అవకాశం ఉంది. నేడు వీరికి పెట్టుబడులకు అనుకూల సమయం.
మిథునం
మిధున రాశి జాతకులకు కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. మిధున రాశి వారి పనుల్లో చురుకుదనం పెరుగుతుంది.
కర్కాటకం
కర్కాటక రాశి జాతకులకు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నేడు వీరు ఖర్చులను నియంత్రించాలి.
సింహం
నేడు సింహరాశి జాతకుల గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారుల నుంచి సహకారం లభిస్తుంది.
కన్యా
కన్య రాశి జాతకులకు ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పులు అనుకూలంగా మారవచ్చు.
తులా
నేడు తులారాశి జాతకులు శుక్ర ప్రభావంతో ఆర్థిక లాభాలు పొందుతారు . దాంపత్యంలో సౌఖ్యం ఉంటుంది.
వృశ్చికం
నేడు వృశ్చిక రాశి జాతకులకు అనుకోని ఖర్చులు వస్తాయి. సాయంత్రం మంచి సమాచారం అందుతుంది.
ధనుస్సు
ధనుస్సు రాశి జాతకులకు కొత్త ప్రణాళికలు విజయవంతం అవుతాయి. విద్యార్థులకు నేడు అనుకూల సమయం.
మకరం
నేడు మకర రాశి జాతకుల పనుల్లో ఆలస్యం కనిపిస్తుంది. సహనం పాటిస్తే ఫలితం మంచిగా ఉంటుంది.
కుంభం
కుంభరాశి జాతకులకు సూర్య బుధ ప్రభావంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు బయటపడతాయి.
మీనం
నేడు మీనరాశి జాతకులకు శని ప్రభావంతో క్రమశిక్షణ అవసరం అవుతుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి.












Click it and Unblock the Notifications