today rasi phalalu: నేడు ఈ రాశులవారు శుభవార్తలు వింటారు!!

మార్చి 14వ తేదీన గ్రహాల గమనం కారణంగా వివిధ రాశుల వారి జాతకాలలో గణనీయమైన మార్పులు ఉన్నాయి, మేష రాశి నుంచి కన్యా రాశి వరకు వివిధ రాశుల వారికి నేడు ఏ విధంగా ఉండబోతుంది. ఈరోజు ఎవరికి శుభం జరుగుతుంది? ఎవరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది? తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి . స్థిరమైన బుద్ధితో వ్యవహరిస్తే ఈరోజు ఉద్యోగులు ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అవసరమవుతాయి. ఇక మేష రాశి జాతకులకు ఈరోజు ఇబ్బంది వస్తే సకాలంలో ఆదుకునే వారు కూడా ఉన్నారు. వీరికి నేడు శివారాధన చేయడం శుభప్రదంగా చెప్పబడింది.

today rasi phalalu Today these zodiac signs have some good news

వృషభ రాశి
వృషభ రాశి వారికి నేడు అన్ని విధాలుగా బాగుంది. నేడు మీరు ఒక శుభవార్తను వినే అవకాశం ఉంది. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. బంధుమిత్రులను కలుసుకుని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. అయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం వల్ల వీరికి మంచి జరుగుతుంది.

మిధున రాశి
మిధున రాశి జాతకులు ఈరోజు ఒక శుభవార్త వింటారు. ఈ శుభవార్త వారిలో మనోధైర్యాన్ని పెంచుతుంది. ప్రస్తుతానికి స్వస్థాన ప్రాప్తి సూచనలు కూడా ఉన్నాయి. స్థిర నిర్ణయాలతో చేసే పనులు ఫలితాలను ఇస్తాయి. ఈరోజు దుర్గా స్తుతి చదివితే అంతా మేలు జరుగుతుంది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు అన్ని విధాలుగా బాగుంటుంది. వీరి ప్రతిభకు తగిన ప్రశంసలు లభిస్తాయి. విందులు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అభివృద్ధి గురించి ఆలోచనలు చేస్తారు. అపోహలతో కాలాన్ని వృధా చేయకుండా ఉండాలి. ఈశ్వర దర్శనం చేయడం మంచిది.

సింహరాశి
సింహరాశి జాతకులు అందరినీ కలుపుకొని పోవడం అవసరం. కొన్ని సంఘటనలు మీలో ఆత్మ విశ్వాసాన్ని బాగా పెంచుతాయి. నేడు కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు కూడా ఫలవంతంగా ఉంటాయి. ఇష్ట దైవ ప్రార్థన చేయడం శుభప్రదంగా చెప్పబడింది.

కన్యారాశి
కన్య రాశి జాతకులు ఈరోజు ఆచితూచి అడుగు వేయాలి. కీలక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి పెరగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది కాబట్టి ఇది సానుకూల ఫలితంగా భావించవచ్చు. అనవసరపు ఖర్చులు పెట్టకుండా ఉండాలి. శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+