తులారాశిలో కుజ సంచారం.. ఈ మూడు రాశులవారికి అదృష్టం.. మీ రాశి ఇందులో ఉందా?
వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మన జీవితాలపైన వివిధ గ్రహాల సంచార ప్రభావం ఎంతో ఉంటుంది. ఈ మార్పు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. వేద జ్యోతిష్య శాస్త్రంలో తులారాశిలో కుజ గ్రహ సంచారం 12 రాశుల వారి జాతకాలపైన ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా తులా రాశిలో కుజ గ్రహ సంచారం మూడు రాశుల వారికి లబ్ధి చేకూరుస్తుంది.
మేష రాశి, వృశ్చిక రాశి, కన్యారాశి జాతకులు తులా రాశిలో కుజ గ్రహ సంచారం వల్ల లబ్ధిని పొందుతారు. మేష రాశి జాతకులకు తులా రాశి లోని కుజుడు అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు. మేషరాశి జాతకులు ఈ సమయంలో వైవాహిక జీవితంలో మంచి క్షణాలను అనుభవిస్తారు. మేషరాశి జాతకుల వ్యక్తిగత ఎదుగుదలకు, విజయానికి ఇది అనుకూలంగా ఉంటుంది.

కెరీర్ గురించి ప్లాన్ గా ఉన్న మేష రాశి వారు వారి ఆలోచనలు సత్ఫలితాలను ఇవ్వడానికి ఇది సరైన సమయం. వృత్తి వ్యాపారాలలోనూ మేష రాశి జాతకులకు బాగా లాభదాయకంగా ఉంటుంది. ఇది మేష రాశి వారికి శుభ సమయం అని చెప్పాలి.
తులా రాశిలో కుజుడు వృశ్చిక రాశి వారికి అదృష్టాన్ని ఇస్తాడు. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఆర్థిక వనరుల పెరుగుదల ఆశాజనకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి కుజుడు సానుకూల శక్తిని ఇచ్చి వారి ఆదాయాన్ని గణనీయంగా పెంచుతాడు. ప్రస్తుతం పెట్టిన పెట్టుబడులు ఊహించని లాభాలను ఇస్తాయి. వ్యాపార దృష్టి గల వారికి గణనీయమైన వృద్ధి కనిపిస్తుంది.
తులా రాశిలో కుజుడు కన్యా రాశి వారికి ఊహించని లాభాలను చేకూరుస్తాడు. కన్యా రాశి వారికి ఈ సమయంలో సంపద, శ్రేయస్సు పెరుగుతుంది. కొత్త ఆర్థిక అవకాశాలు కనిపిస్తాయి. కన్య రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తులా రాశిలో కుజుడు కన్యా రాశి వారి వృత్తి జీవితాన్ని కూడా అనుకూలంగా ప్రభావితం చేస్తాడు.ఈ అక్టోబర్ నెలలో మూడు రాశుల వారికి విశేషమైన ఫలితాలు కలుగుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications