Astrology: సింహరాశిలో శుక్ర సంచారం: ఈ రాశులవారు అదృష్టవంతులు; మీరున్నారా?
సింహ రాశిలో శుక్ర సంచారం జూలై 7వ తేదీన తెల్లవారుజామున మూడు గంటల 59 నిమిషాల కు జరగనుంది. ఆ రోజున శుక్రుడు ఉన్న రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని తర్వాత మళ్లీ శుక్రుడు జూలై 23వ తేదీన అదే రాశిలో తిరోగమనం చేస్తాడు.
ఏడు రాశులవారికి అదృష్టం: సింహరాశిలో శుక్ర సంచారం వల్ల ఏడు రాశుల వారికి అదృష్టం కలగనుంది. అందులో మీ రాశి కూడా ఉందా? ఆ అదృష్టవంతులలో మీరు కూడా ఉన్నారా? ఒకసారి చెక్ చేసుకోండి.సింహ రాశి లో శుక్ర సంచారం వల్ల జూలై 7వ తేదీ నుండి 7 రాశిచక్రాల వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి. వారికి అదృష్టం కలిసి వస్తుంది.

మేష రాశి: సింహ రాశి లో శుక్ర సంచారం వల్ల మేష రాశి వారికి ప్రేమ సంబంధాలు బలపడతాయి. వృత్తిలోనూ, ఆర్థిక రంగాలలోనూ పేరు, ప్రఖ్యాతులను సంపాదిస్తారు. ఇష్టమైన వారి కోరికలు నెరవేర్చటం కోసం బాగా కష్ట పడతారు. ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో మేష రాశి జాతకులు ఈ సమయంలో ఇతరుల మెప్పు పొందుతారు.
వృషభ రాశి: సింహరాశిలో శుక్ర సంచారం వల్ల వృషభ రాశి వారికి సంతోషం వెల్లివిరుస్తుంది. వృత్తి పరమైన అవకాశాలు పెరుగుతాయి. నూతన గృహప్రవేశ అవకాశం ఉంది. శుభకార్యాలకు, కొత్త వాహనాల కొనుగోలుకు ఇది సరైన సమయం. ఈ సమయంలో వృత్తికి పుష్కలమైన అవకాశాలు ఉంటాయి. ఆస్తికి సంబంధించి చట్టపరమైన విషయాలపై శ్రద్ధ వహించాలని సూచించబడింది.
సింహరాశి: సింహరాశిలో శుక్ర సంచారం వల్ల సింహ రాశి జాతకులకు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం లేకుండానే అప్రయత్నంగా ఇతరుల దృష్టిని మీరు ఆకర్షిస్తారు. జీవితంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఈ సమయంలో పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి.
కర్కాటక రాశి: సింహ రాశి లో శుక్ర సంచారం వల్ల కర్కాటక రాశి వారు జీవితంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కర్కాటక రాశి జాతకులు గణనీయమైన ఆర్థిక లాభాలను ఆర్జిస్తారు. ఇతరుల దృష్టిని బాగా ఆకర్షించారు. ఇది మీ వ్యక్తిత్వాన్ని మరింత ఇనుమడింపజేసే సమయం. కర్కాటక రాశి వారికి ఆదాయ వనరులు విపరీతంగా పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు సమాజములో లభిస్తాయి
కన్యారాశి: సింహ రాశి లో శుక్ర సంచారం వల్ల కన్యా రాశి వారికి మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ కాలంలో ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. కన్యా రాశి జాతకులు ఈ సమయంలో సంతృప్తికరమైన, ప్రశాంత కరమైన జీవితాన్ని అనుభవిస్తారు.
వృశ్చిక రాశి: సింహ రాశి లో శుక్ర సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి జీవితంలో మంచి మార్పులు వస్తాయి. వృశ్చిక రాశి జాతకులు ఆధ్యాత్మిక మార్గంలో పడతారు. ఆధ్యాత్మిక వృద్ధితో మానసిక ప్రశాంతతను సాధించడానికి ఇది సరైన సమయం. అంతర్గత శాంతి కోసం ఆధ్యాత్మిక సాధన లో నిమగ్నం అవ్వాలని సూచించబడింది.
తులారాశి: సింహరాశిలో శుక్ర సంచారం వల్ల తులా రాశి వారికి ఆదాయాల్లో చెప్పుకోదగ్గ పెరుగుదల కనిపిస్తుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఈ సమయంలో వీరికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తులా రాశి వారికి పెట్టుబడులకు ఇది సరైన సమయం. వ్యాపారం మెరుగుపడుతుంది. అన్నింటిలోనూ విజయాలను సాధిస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications