మార్చి నెలలో త్రిగ్రాహి యోగంతో వీరికి జాక్ పాట్
వేద జ్యోతిష్య శాస్త్రంలో నవ గ్రహాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ప్రతీ గ్రహం ఒక రాశి నుండి మరొక రాశిలోకి నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తున్నాయి. 2026 మార్చి 15న అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. ఈ రోజున సూర్యుడు, శని, శుక్రుడు ఒకే రాశిలో కలిసే ప్రత్యేక సంయోగం ఏర్పడుతుంది.
త్రిగ్రాహి యోగం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యోగం శక్తివంతమైన ఫలితాలను ఇస్తుందని భావిస్తారు. ముఖ్యంగా కర్మదేవుడైన శని, అధికారానికి ప్రతీక అయిన సూర్యుడు, సుఖం-సంపద ప్రతీక అయిన శుక్రుడు కలిసి ప్రభావం చూపుతాయి. ఈ సంయోగం కారణంగా ఏర్పడే త్రిగ్రాహి యోగంతో కొన్ని రాశులవారికి కలిసి వస్తుంది.

వృషభం
త్రిగ్రాహి యోగం కారణంగా వృషభ రాశి జాతకులకు ఆర్థిక లాభాలు కలుగుతాయి. కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి. పెట్టుబడులు లాభదాయకంగా మారే సూచనలు ఉన్నాయి. ఇది వృషభ రాశి వారికి అన్ని విధాలా లాభాలను ఇచ్చే సమయం.
సింహం
త్రిగ్రాహి యోగం కారణంగా సింహరాశి జాతకులకు ఉద్యోగంలో గుర్తింపు వస్తుంది. సింహరాశి జాతకులకు పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారి నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వస్తాయి. ఇది అన్ని విధాలా సింహరాశి వారికి అనుకూల సమయం.
మకరం
శని అనుగ్రహంతో పాటు త్రిగ్రాహి యోగం కారణంగా కష్టానికి ఫలితం దక్కే సమయం చూస్తారు మకరరాశి జాతకులు. స్థిరాస్తి, వృత్తి రంగాల్లో పురోగతి కనిపిస్తుంది. ఈ సమయంలో ఆర్ధికంగా పురోగతి కనిపిస్తుంది.
కుంభం
త్రిగ్రాహి యోగం కారణంగా కుంభరాశి జాతకులకు అన్ని విధాలా కలిసి వస్తుంది. సామాజిక గౌరవం పెరుగుతుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ఇది అన్ని విధాలా శుభ ఫలితాలను ఇచ్చే సమయం.
మీనం
శుక్ర ప్రభావంతో ధనయోగం కలుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. త్రిగ్రాహి యోగం కారణంగా మీనరాశి జాతకులు అన్ని విధాలా శుభ ఫలితాలు పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. మీనరాశి జాతకులు ఉద్యోగాలు చేస్తే సనుకూలతలను చూస్తారు.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు. వ్యక్తిగత జాతకాలను బట్టి ఫలితాలు మారవచ్చు.












Click it and Unblock the Notifications