30ఏళ్ళ తర్వాత త్రిగ్రాహి యోగం.. త్వరలో ఈ రాశులవారిపై కనకవర్షం!
వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. గ్రహాల సంయోగం కారణంగా ఏర్పడే యోగాలు ద్వాదశ రాశుల వారి జీవితాలలో గణనీయమైన మార్పులను తెస్తాయి. ప్రతి గ్రహ సంచారానికి ఒక ప్రత్యేకమైన ప్రభావం ఉంటుంది. కొన్ని అరుదైన సమయాలలో ఒకే రాశిలో కొన్ని గ్రహాల కలయిక జరుగుతుంది.
మార్చిలో త్రిగ్రాహి యోగం
మార్చి నెలలో సూర్యుడు, శని, శుక్రుడు కలిసి శక్తివంతమైన త్రిగ్రాహి యోగాన్ని ఏర్పరచడం వల్ల కొన్ని రాశుల వారు ఊహించలేని అదృష్టాన్ని పొందబోతున్నారు. 30 సంవత్సరాల తర్వాత శని, శుక్రుడు, సూర్యుడు బృహస్పతికి చెందిన మీనరాశిలో సంయోగం చెంది అన్ని రాశుల వారికి ఫలితాలను ఇవ్వబోతున్నారు. ఇక త్రిగ్రాహి యోగం కారణంగా లబ్ధిని పొందే రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభరాశి వారికి త్రిగ్రాహియోగం ప్రయోజనకరమైన మార్పులను తీసుకొస్తుంది. ఈ శక్తివంతమైన యోగం కారణంగా వీరికి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఈ రాశులవారి ఆదాయం మరియు లాభగృహంలో త్రిగ్రాహియోగం ఏర్పడడం వల్ల వీరి పురోభివృద్ధి సాధ్యమవుతుంది. ఉద్యోగంలో వారు ఇంక్రిమెంట్లను ఆశించవచ్చు. ఇతరుల దగ్గర చిక్కుకున్న డబ్బు తిరిగి చేతికి అందుతుంది. వ్యాపారులు వివిధ ఒప్పందాల ద్వారా ఊహించని ఆర్థిక లాభాలను పొందుతారు. కుటుంబంలో శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగుంటుంది.
మిధున రాశి
త్రిగ్రాహి యోగం కారణంగా మిధున రాశి వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో మిధున రాశి వారు ఊహించని ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మిధున రాశి వారి కర్మ స్థానంలో త్రిగ్రాహి యోగం ఏర్పడడం వల్ల ఇది వీరికి వివిధ ఒప్పందాలనుంచి మంచి లాభాలను తెస్తుంది. వ్యాపారవేత్తలకు గణనీయమైన లాభాలు వస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. కుటుంబ జీవితంలో శాంతి సంతోషం ఉంటుంది.
కర్కాటక రాశి
త్రిగ్రాహి యోగం కారణంగా కర్కాటక రాశి వారి జీవితాలలో అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరి కష్టాలు తొలగిపోయి సంతోషం వస్తుంది. కర్కాటక రాశి వారి తొమ్మిదవ ఇంట్లో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా మీరు వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో విజయం సాధిస్తారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. పోటీ పరీక్షలలో విద్యార్థులు విజయం సాధిస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications