15రోజుల్లో పులిపంజా చీల్చి కోటీశ్వరులయ్యేది వీరేనని తేల్చిన త్రిగ్రాహి యోగం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలను నిర్దేశిస్తాయి. గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ, మరికొన్ని గ్రహాలతో కలిసి వివిధ యోగాలను ఏర్పరుస్తున్నాయి. ఇక ఈ సంవత్సరం జూన్ మాసం చాలా ప్రత్యేకంగా చెప్పబడుతుంది. జూన్ మాసంలో మిధున రాశిలో అరుదైన గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది.
మిధున రాశిలో త్రిగ్రాహి యోగం
జూన్ మాసంలో బుధుడు మిధున రాశిలో సంచరిస్తాడు. జూన్ 15 ఉదయం 6 గంటల 52 నిమిషాలకు సూర్యుడు మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలోనే గురువు కూడా మిధున రాశిలో ఉంటాడు.దీంతో సూర్య బుధ గురువుల కలయిక కారణంగా త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి జాతకులకు త్రిగ్రాహి యోగం కారణంగా కలిసి వస్తుంది. ఈ యోగం మేష రాశి వారి జీవితాల్లో సంతోషాన్ని ఇస్తుంది. వీరి జీవితంలో సానుకూల శక్తిని పెంచుతుంది. మేష రాశి వారికి ఈ సమయంలో వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. ఎప్పటినుంచో ఉన్న ఇబ్బందులు పరిష్కారమవుతాయి. ప్రతి పనిని పూర్తి చేసి సక్సెస్ అందుకుంటారు. మేషరాశి జాతకులకు ఈ సమయం ఆర్థికంగా పురోగతిని కలిగిస్తుంది.
వృషభ రాశి
వృషభ రాశి జాతకులు త్రిగ్రాహి యోగం కారణంగా లబ్ధిని పొందుతారు. ఈ రాశి వారు ఈ సమయంలో మతపరమైన కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. పనిచేసే చోట విజయాలను సాధిస్తారు. మంచి గుర్తింపును పొందుతారు. ఈ సమయంలో ఆరోగ్యం బాగుంటుంది. వైవాహిక జీవితం సంతోషదాయకం గా ఉంటుంది. జీవిత భాగస్వామితో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ సమయంలో పాత మిత్రులను కలుసుకుంటారు.
కన్యారాశి
త్రి గ్రాహి యోగం కారణంగా కన్యారాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో కన్యా రాశి వారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కోర్టు కేసుల నుంచి ఉపశమనం కలుగుతుంది. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి అధిక లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామితో బంధం దృఢంగా మారుతుంది. ఆర్థికంగా ఈ సమయంలో పురోగతిని సాధిస్తారు. అన్ని విధాల ఈ సమయం సత్ఫలితాలను ఇస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications