మౌని అమావాస్య నాడే త్రిగ్రాహి యోగం.. రేపటినుండి నక్కతోక తొక్కుతున్న రాశులివే!
సనాతన ధర్మంలో అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ప్రతినెల కృష్ణపక్షంలో చివరి రోజున అమావాస్య తిధి ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం వచ్చే మొత్తం 12 అమావాస్య తిధులలో మౌని అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంటుంది. మాఘమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు.
మౌని అమావాస్య నాడు త్రిగ్రాహి యోగం
ఈ సంవత్సరం మౌని అమావాస్య జనవరి 29వ తేదీన వస్తుంది. అమావాస్య రోజు ఒక ఆసక్తికర గ్రహసంయోగం జరుగుతుంది. అమావాస్య రోజు సూర్యుడు, చంద్రుడు, బుధుడు మకర రాశిలో సంయోగం చెందుతారు. మూడు గ్రహాలు సంయోగం వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను కలిగిస్తుంది.

వృషభ రాశి
త్రిగ్రాహి యోగం కారణంగా వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి .పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో విజయాలు సాధించవచ్చు. జీవిత భాగస్వామి నుంచి ప్రేమను పొందుతారు. మతపరమైన విషయాల పైన ఆసక్తి చూపిస్తారు. ఈ సమయంలో వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు చేసేవారు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
తులారాశి
తులారాశి వారికి త్రిగ్రాహి యోగం కారణంగా కెరీర్లో పురోగతి ఉంటుంది. తులారాశి వారి కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేవారు ఆర్థికంగా లాభపడతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ప్రయాణాలకు అవకాశం ఉంది. ఈ సమయం తులా రాశి వారికి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి.
కన్య రాశి
త్రిగ్రాహి యోగం కారణంగా కన్య రాశి జాతకులు ప్రయోజనాలను పొందుతారు. వారు తమ వృత్తిలో పురోగతిని సాధిస్తారు. ఉన్నతాధికారుల నుండి సహకారం అందుతుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కన్యా రాశి వారి ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుంది. ఇది కన్యా రాశి వారికి శుభ సమయం.
మకర రాశి
త్రిగ్రాహి యోగం కారణంగా మకర రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. మకర రాశి జాతకులు ఈ సమయంలో నూతన గృహాలను, భూములను, వాహనాలను కొనుగోలు చేస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఊహించని లాభాలు వస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మకర రాశి వారి డబ్బు సమస్యలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications