నవంబర్ లో ఈ రాశులవారిని కుబేరులను చేసే త్రిగ్రాహి యోగం!
నవంబర్ మాసంలో అనేక గ్రహాలు తమ రాశులను మార్చుకోబోతున్నాయి. కొన్ని గ్రహాలు ఇతర గ్రహాలతో కలిసి సంయోగాలను ఏర్పరుస్తున్నాయి. నవంబర్ మాసంలో ముఖ్య గ్రహాల సంయోగం కారణంగా త్రిగ్రాహి, చతుర్గ్రాహి యోగాలు ఏర్పడతాయి. ప్రస్తుతం మనం నవంబర్ మాసంలో వృశ్చిక రాశిలో ఏర్పడబోయే త్రిగ్రాహి యోగం, దాని ఫలితంగా కొన్ని రాశులకు కలగబోయే లాభాలను గురించి తెలుసుకుందాం.
వృశ్చిక రాశిలో త్రిగ్రాహి యోగం
గ్రహాలకు అధిపతి అయిన కుజుడు, సంపదను ఇచ్చే శుక్రుడు, గ్రహాల రాజు సూర్యుడు ఈ మూడుగ్రహాలు కలిసి త్రిగ్రాహియోగాన్ని ఏర్పరుస్తున్నాయి. వృశ్చికరాశిలో ఏర్పడే ఈ యోగం కొన్ని రాశులకు అదృష్టాన్ని చేకూరుస్తుంది. త్రిగ్రాహి యోగం కారణంగా కొన్ని రాశులవారు సంపదలను చూస్తారు. పనిలో, వ్యాపారంలో పురోగతిని చూస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేయవచ్చు. త్రిగ్రాహి యోగంతో కలిసి వచ్చే ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి త్రిగ్రాహి యోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ రాశిలో లగ్న గృహంలో ఈ యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారి ధైర్యసాహసాలు పెరుగుతాయి. గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. కొత్త ఉద్యోగాలు, వాహనాలు, ఆస్తులు సంపాదించే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. వృశ్చిక రాశి వారు పాత పెట్టుబడుల నుండి ప్రయోజనాలను పొందుతారు.
మకర రాశి
త్రిగ్రాహి యోగం కారణంగా మకర రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ యోగం మకర రాశిలో ఆదాయ మరియు లాభ గృహంలో ఏర్పడుతుంది. ఈ సమయంలో మకర రాశి జాతకుల సంపద పెరిగే అవకాశం ఉంది. ఎప్పటినుంచో ఆగిపోయిన ఒప్పందాలు ఈ సమయంలో ఖరారు అవుతాయి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. స్టాక్ మార్కెట్ లాటరీలలో పెట్టుబడులు పెట్టే వారికి కలిసివస్తుంది.
మీనరాశి
త్రిగ్రాహి యోగం కారణంగా మీన రాశి జాతకులు శుభ ఫలితాలను చూస్తారు. మీనరాశిలో 9వ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. ఇది వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎప్పటినుంచో నిలిచిపోయిన ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. కొత్త అవకాశాలు వస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications