జనవరి 22వ తేదీ వరకు ఈ రాశులపై కాసుల వర్షం కురిపిస్తున్న కుజుడు

ఖగోళంలో నవగ్రహాలు నిర్దిష్ట సమయంలో తమ రాశులను మారుస్తూ సంచారం చేస్తుంటాయి. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై పడుతుంది. ఒక్కో గ్రహం రాశిని మార్చడానికి ఒక్కోరకమైన సమయాన్ని తీసుకుంటుంది. ఈ సంచార ప్రభావం కొన్ని రాశులకు మంచి పరిణామాలను కలిగిస్తే మరికొన్ని రాశులకు చెడు ప్రభావాలను కలిగిస్తుంది. అయితే అవి వారి కర్మలను బట్టి ఆధారపడివుంటుంది.

ఒకే రాశిలో ఎక్కువ గ్రహాలుంటే రాజయోగం ఏర్పడుతుంది. అలాగే ఒకే రాశిలో గ్రహం ఎక్కువ రోజులుంటే దాన్ని స్తంభన అంటారు. ప్రస్తుతం రాహువు, కేతువు, కుజుడు ఒకే రాశిలో ఉండాల్సిన సమయం కంటే ఎక్కువ రోజులున్నాయి. ప్రధానంగా కుజుడు 202425 మధ్యలో ఎక్కవ రోజులపాటు ఉంటాడు. అప్పుడు ఇది కుజ స్తంభన అవుతుంది. వాస్తవానికి ఏ రాశిలో అయినా కుజుడు 45 రోజులు మాత్రమే ఉంటాడు. కుజ స్తంభన వల్ల విపరీతమైన రాజయోగం ఏర్పడుతోంది. 2025 జనవరి 22వ తేదీ వరకు కర్కాటక రాశిలోనే కుజుడు స్తంభించిపోతాడు. దీనివల్ల ఏ రాశులకు కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

two zodiac signs will get money and happy life and healthy life due to kuja sthambhana

సింహ రాశి
ఈ రాశివారు ఆర్థికంగా మంచి లాభాలను పొందుతారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ సమయం మొత్తం వీరికి అదృష్టకాలం అని చెప్పొచ్చు. రుణబాధల నుంచి బయటపడతారు. శత్రువుల పీడ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ సమయంలో శత్రువులు కూడా మిత్రలుగా మారతారు. కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో ఉన్న మనస్పర్థలు తొలిగిపోయి విహారయాత్రలకు వెళతారు.

మేషరాశి
వ్యాపారస్తులకు మంచి లాభం కలుగుతుంది. రుణబాధల నుంచి బయటపడతారు. స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నవారికి కాసుల వర్షం కురుస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరగడంతోపాటు ఆర్థిక లాభం కలగనుంది. అలాగే రోగాల నుంచి బయటపడతారు. స్నేహితులతో లేదంటే కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు లేదంటే తీర్థయాత్రలకు వెళతారు. అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటే మంచి స్థాయికి వెళతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+