Ugadi 2023 predictions: వృషభ రాశి వారికి ఈ ఉగాది తర్వాత కలిసొస్తుందా?
ఉగాదికి సమయం సమీపిస్తున్న తరుణంలో ఈ ఉగాది నుండి వృషభ రాశి జాతకుల జాతకం ఏ విధంగా ఉండబోతుంది? ఈ సంవత్సరం వారికి కలిసి వస్తుందా లేదా? తెలుసుకుందాం.
తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రానే వస్తుంది. ఇక రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు ఈ ఉగాది పండుగ తమ జీవితాలను ఏ విధంగా మార్చబోతుంది? తమ రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ సంవత్సరం కలిసి వస్తుందా లేదా? వంటి అనేక విషయాలను తెలుసుకోవడానికి చాలా ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం చేసి ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే అంశాలను జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తారు. ఇక ఉగాదికి సమయం సమీపిస్తున్న తరుణంలో ఈ ఉగాది నుండి వృషభ రాశి జాతకుల జాతకం ఏ విధంగా ఉండబోతుంది? ఈ సంవత్సరం వారికి కలిసి వస్తుందా లేదా? వంటి విషయాలను తెలుసుకుందాం.

వృషభ రాశిలో ఈ ఏడాది గ్రహాల సంచారం ఇలా
ముఖ్యంగా కృత్తికా నక్షత్రం 1, 2, 3 పాదాలు, రోహిణి నక్షత్రం లోని అన్ని పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభ రాశి కిందకు వస్తాయని పేర్కొన్నారు. వృషభ రాశి జాతకులకు 2023 సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 11 గా ఉంటుందని, రాజ పూజ్యం 6, అవమానం 1గా ఉంటుందని పేర్కొన్నారు. 2023- 2024 లో వృషభ రాశిలో సూర్యుడు 12వ మరియు ఒకటవ ఇంట్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి మే 15వ తేదీ వరకు సంచరిస్తాడు. ఆగస్టు 18 నుండి సెప్టెంబర్ 17 వరకు అర్ధాష్టమ స్థానంలోనూ, డిసెంబర్ 17 2023 నుండి జనవరి 14 2024 వరకు అష్టమ స్థానంలోనూ సంచరిస్తాడు. ఇక కుజుడు జూన్ 30 నుండి ఆగస్టు 16 వరకు అష్టమ స్థానంలోనూ డిసెంబరు 28 నుంచి ఫిబ్రవరి 5 2024 వరకు అర్ధాష్టమ స్థానంలోనూ సంచరిస్తాడు.

ఆదాయంలో పెరుగుదల ఉన్నా ఫలితాల్లో అలా
ఇక గురుడు 12వ ఇంటి గుండా సంచరిస్తే, శని శుభ స్థానంలోనే సంచరిస్తున్నాడు. ఇక రాహు, కేతువులు కూడా ఇద్దరూ శుభస్థానంలోనే సంచరిస్తున్నారు. దీనివల్ల ఈసారి వృషభ రాశి జాతకులకు కొన్ని అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది. వృషభ రాశి జాతకులకు ఈ సంవత్సరం ఆదాయంలో స్థిరమైన పెరుగుదల ఉన్నప్పటికీ వారు ఆశించిన మేరకు ఫలితాలు ఉండకపోవచ్చు. అందుకే ఎటువంటి హఠాత్తు నిర్ణయాలను తీసుకోకుండా ఉండడమే మంచిదని సూచించబడింది.

పెట్టుబడులు పెడుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి
వృషభ రాశి జాతకులకు ఈ సంవత్సరం పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది. ఏవైనా పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణులు సలహాలు తీసుకోవడం మంచిది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఊహించని ఖర్చులు ఉంటాయి. అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఖర్చుల విషయంలో అప్రమత్తంగా లేకపోతే తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుంది. వృషభ రాశి వారికి 2023- 2024 సంవత్సరం వారి ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలలో కొన్ని మార్పులను తీసుకువచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు వారి ప్రతిభను సామర్ధ్యాలను ప్రదర్శించి విజయాన్ని సాధిస్తారు పదోన్నతులు లభించే అవకాశం ఉంది.

వ్యాపారాలు చెయ్యటానికి మంచి సమయమేనా?
2023- 2024 సంవత్సరంలో సొంత వ్యాపారం చేయాలనుకునే వారికి మంచి సమయంగానే చెప్పబడింది. అయితే ప్రధానంగా వ్యాపారంలో వారి బలాలపై దృష్టి సారించి కొత్త ఆలోచనలతో వ్యాపారం చేసినప్పుడే అది సక్సెస్ అవుతుంది. ఇక వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యం విషయంలో మిశ్రమ సంవత్సరంగా ఉంటుందని చెబుతున్నారు. వృషభ రాశి వారు అనేక మానసిక సమస్యలను ఎదుర్కోవడంతోపాటు, తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి రెగ్యులర్ హెల్త్ చెకప్ లు సిఫార్సు చేయబడ్డాయి.

కుటుంబ సంబంధాలలో ఇలా?
2023- 24 సంవత్సరం వృషభ రాశి వారికి కుటుంబ సంబంధాలలో కొన్ని బేధాభిప్రాయాలను తీసుకురావచ్చు. కుటుంబ సభ్యులతో వాదనలు లేదా వివాదాలకు దూరంగా ఉండాల్సిన సమయం అని సూచించబడింది. కొంత మానసిక క్షోభను ఈ కాలంలో అనుభవించవచ్చు. ఈ కాలంలో కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం ఉంది. 2023- 24 సంవత్సరం వృషభ రాశి వారు వివాహం చేసుకోవడానికి అనుకూలమైన సమయం కాకపోవచ్చు. వృషభ రాశిలో ఉన్న విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం ఫలితాలు ప్రతికూలంగానే ఉంటాయి. కాబట్టి కష్టపడి పని చేయాల్సిన, చదవవలసిన అవసరం ఉందని చెప్పబడింది. మొత్తంగా చూస్తే ఈసారి వృషభ రాశి వారికి అంత సానుకూలమైన వాతావరణం లేకపోవడం వల్ల జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications