Ugadi 2025 horoscope:మీనరాశి వారిపై ఈ ఏడాది శని ఎఫెక్ట్.. ఎలా ఉంటుందంటే
శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి గాను మీన రాశి యొక్క రాశి ఫలితాలు
ఆదాయము-5
వ్యయము- 5
రాజ్యపూజ్యము-3
అగౌరవము- 1 మీన రాశి వారికి ఈ సంవత్సరములో ఆదాయానికి మించిన ధన వ్యయం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. శరీర స్థానంలో శని ఉండడం వల్ల అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. స్త్రీలు శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి.
మీనరాశి వారి వార్షిక ఫలాలు
మీ శ్రమకి తగిన గుర్తింపు లభించకపోవడం వల్ల కొంత నిరాశకు లోనవుతారు. మీరు చేయని తప్పుకి అపనిందలు మరియు అవమానములను ఎదుర్కోనవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఋణ సమస్యలు మరియు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండును. రాజకీయరంగంలో ఉన్నవారు శత్రువుల పైన విజయం సాధించడం కోసం ప్రణాళికను సిద్ధం చేస్తారు. మంత్ర బలాన్ని పెంచుకోవడం ద్వారా దైవానుగ్రహం లభిస్తుంది. పట్టుదల సడలింపు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి.

మీనరాశి వారు చెయ్యాల్సింది ఇదే
అకారణ కలహాలకు దూరంగా ఉండాలి. మీ ఆవేశాన్ని మరియు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. శరీరం సహకరించకపోవడం వల్ల ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.
ఇతరుల విషయాలలో తల దూర్చడం అంత మంచిది కాదు. వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. విద్యార్థులు పోటీ పరీక్షలు యందు విజయాలు సాధిస్తారు. నూతన విద్యను అభ్యసించే విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
ప్రతికూల ఫలితాలకు చాన్స్
శరీరంలో దాగి ఉన్న అనారోగ్య సమస్యలు నిర్ధారణ కాకపోవడం ఒక సమస్యగా మారుతుంది. Real Estate వ్యాపారస్తులకు అధిక పెట్టుబడులు పెట్టవలసి వస్తుంది. వివాహ ప్రయత్నాలు వాయిదా పడతాయి. సంతాన ప్రయత్నాలు చేసే వారికి ఆలస్యాన శుభ ఫలితాలు వుండును. కోర్టుకేసుల యందు మొదట ఇబ్బందులు ఉన్నప్పటికీ చివరకు విజయం సాధిస్తారు. భూమికి సంబంధించిన తగాదాలు తగ్గుముఖం పడతాయి. ఈ రాశి స్త్రీలకు గర్భానికి సంబంధించిన ఆపరేషన్స్ అయ్యే అవకాశం కలవు.
రాజకీయ నాయకులు జాగ్రత్త
రాజకీయ రంగంలో ఉన్నవారికి స్త్రీల వలన సమస్యలు ఏర్పడతాయి.కాబట్టి స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. Sand Mining వ్యాపారస్తులకు ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకునే అవకాశాలు కలవు. గృహంలో Civil works కొరకు ధన వ్యయం చేస్తారు. జీవిత భాగస్వామితో తగాదాలకు దిగడం అంత మంచిది కాదు. జమానతు సంతకాలు జోలికి వెళ్ళకూడదు. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి కొంత ఆలస్యం అయినా వీసా మంజూరు అవుతుంది.
ఈ విషయాలలో శ్రద్ధ అవసరం
ప్రయాణాలలో అనారోగ్య సమస్యలు వచ్చును. కాబట్టి దూర ప్రాంత ప్రయాణములు వాయిదా వేసుకోవడం చెప్పదగిన సూచన. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కుటుంబ సభ్యుల సలహా కోరుతారు. శరీరానికి గాయాలు అయ్యే అవకాశాలు కలవు. కాబట్టి స్త్రీలు వంట చేసేటప్పుడు మరియు పురుషులు వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి స్థానచలనం కలిగే అవకాశాలు కలవు. వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచన.
నివారణలు ఇలా
క్రీడారంగంలో ఉన్న వారికి నూతన అవకాశం చేజారిపోయే అవకాశం కలదు. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు దేవాలయ నిర్మాణానికి కొంత ధనాన్ని విరాళంగా ఇస్తారు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు మితిమీరిన మంచితనం మంచిది కాదు అనే విషయాన్ని గ్రహిస్తారు. రేవతి నక్షత్ర జాతకులకు విశ్వాస పాత్రులు దూరమవుతారు. ఏలినాటి శనికి మరియు రాహువుకి సంబంధించిన గ్రహ జపములు జరిపించి తగు దానములు ఇవ్వవలెను. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడం మరియు మన్య సూక్త హోమం నిర్వహించుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందగలుగుతారు.












Click it and Unblock the Notifications