Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ugadi 2025 horoscope: సింహరాశి వారికి అష్టమశని ప్రభావం, ఈ ఏడాదంతా ఇలా!

Ugadi 2025 horoscope: సింహరాశి వారికి అష్టమశని ప్రభావం, ఈ ఏడాదంతా ఇలా!

శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి గాను సింహ రాశి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం.
ఆదాయము-11
వ్యయము- 11
రాజ్యపూజ్యము-3
అగౌరవము- 6
సింహ రాశి వారికి ఈ సంవత్సరములో అష్టమ శని ప్రారంభమవుతుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలి. శరీరమునకు గాయాలు అవడం లేదా పాత రోగములు తిరగబడడం జరుగుతుంది. శరీరం బరువు పెరగకుండా చూసుకోండి.

ఈ విషయాల్లో సింహరాశి వారు జాగ్రత్త
ఎవరిని అతిగా నమ్మకూడదు. మరియు జమానత్ సంతకాలు పెట్టకూడదు. చెయ్యని తప్పుకు అపనిందలు మరియు అవమానములు ఎదుర్కొనవలసి వస్తుంది. బంధు మిత్ర వైరము కలిగే అవకాశాలు కలవు. ఆర్థికపరమైన ఇబ్బందులు మిమ్మల్ని కొంత చికాకుకు గురిచేస్తుంది. తరచూ మీ అభిప్రాయాలను మార్చుకోవడం వలన ఇతరులు మీ ప్రవర్తనను తప్పుపట్టే అవకాశాలు కలవు. పాత బాకీలు ఆలస్యమైనప్పటికీ వసూలు అవుతాయి. మితిమీరిన ఆత్మవిశ్వాసం మంచిది కాదు అని గ్రహిస్తారు.

Ugadi 2025 horoscope leo zodiac sign year horoscope

ఉద్యోగాలు చేసే వారికి ఎలా ఉంటుందంటే
మిర్చి మరియు కూరగాయల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. Printing Press మరియు Schools నడిపే వారికి అధిక లాభాలు ఉండును. విద్యార్థులకు ఆశించిన శుభ ఫలితాలు ఉండును. Administration రంగంలో ఉన్నవారికి పదోన్నతులు ఉండును. బోధన వృత్తిలో ఉన్నవారూ చక్కటి ప్రశంసలు అందుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కొంత ఆలస్యాన శుభవార్త వింటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసే వారికి సానుకూలము.

సింహరాశి వారు మోసాలకు గురయ్యే అవకాశం
వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలము. Sand మరియు Crusher వ్యాపారస్తులు కొంత నష్టపోతారు. Bank loans కొంత ఆలస్యంగా మంజూరు అవుతాయి. రియల్ ఎస్టేట్ మరియు కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వారికి సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. నమ్మిన వారు మోసం చేయడం వలన మానసికంగా కొంత కృంగిపోతారు.

వివాహాల విషయంలో ఇలా
మఖ నక్షత్ర స్త్రీలు ప్రసవంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు కలవు. పుబ్బ నక్షత్ర జాతకులు విలువైన వస్తువులు జారవిడుచుకునే అవకాశం కలదు. వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలము. సంతాన ప్రయత్నాలు చేసే వారు వైద్యుని సంప్రదించి తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించడం ద్వారా సంతాన ప్రాప్తిని పొందగలుగుతారు. కొత్తగా వివాహమైనటువంటి వధూవరులకు మూడవ వ్యక్తిని మీ మధ్యలో రానివ్వకూడదు.

పరిహారాలు ఇలా
వ్యసనాలను నియంత్రణలో ఉంచుకోండి. కోర్టు కేసులు వాయిదా పడతాయి. తండ్రి చేసే వృత్తి వ్యాపారాలు చేసే వారికి యోగ కాలము. సింహ రాశి వారు శనికి , రాహువు మరియు కేతువులకు గ్రహ జపములు జరిపించి తగు దానములు ఇవ్వవలెను. ఈశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+