Ugadi 2025 rashiphal: మిధునరాశి వారికి ఈ ఏడాది ఎలా ఉంటుందంటే!
విశ్వావసు నామ సంవత్సరంలో అన్ని రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక మిధున రాశి జాతకులకు విశ్వావస నామ సంవత్సర రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వారి జీవితంలో కొత్త తెలుగు సంవత్సరంలో చోటు చేసుకోబోతున్న మార్పులు ఏమిటి? అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.
మిధున రాశి వార్షిక ఫలితం ఇలా
బృహస్పతి సంచారం కారణంగా మిధున రాశి జాతకులకు కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మే నెల నుండి డిసెంబర్ నెల వరకు మిధున రాశి జాతకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగాలు చేసేవారు ఆలస్యంగా అభివృద్ధి చెందుతారు. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంది. నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా సరిగ్గా తీసుకోలేక పోతారు.

ఈ ఏడాది మిధున రాశి వారికి ఇలా
అనుకోని ఆపదలలో చిక్కుకోకుండా గౌరవ, మర్యాదలకు భంగం కలగకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక శని ప్రభావంతో మిధున రాశి జాతకులకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. చేసే ప్రతి పనిలోనూ వ్యతిరేక ఫలితాలు రావచ్చు. కొత్త పనులు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ఇక రాహువు మీన రాశి సంచారంతో మిధున రాశి జాతకులకు కలిసి వస్తుంది. ఈ సమయంలో కొంత విందులు, వినోదాలలో పాల్గొంటారు.
మిధున రాశి వారు జాగ్రత్తగా ఉండాలి
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఎప్పటినుండో పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇక కేతువు కన్య రాశిలో సంచారం చేయడంతో మిధున రాశి జాతకులకు కూడా ఆ ప్రభావం పడుతుంది. కేతువు వల్ల కూడా మిధున రాశి జాతకులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మిధున రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. సోదర వైరం కలిగే అవకాశం ఉంటుంది.
నెలల వారీగా ఫలితాలిలా
మిధున రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడానికి గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. శనగలను నైవేద్యం చేసి ఆలయాలలో పంచిపెట్టాలి నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించాలి. ఇక ఉగాది నుండి నెలల వారీగా మిధున రాశి వారి జాతకాన్ని చూస్తే ఏప్రిల్ మాసం అనుకూలంగా ఉంది, మే, జూన్ నెలలు అనుకూలంగా లేవు. జులై మాసం మధ్యస్తంగా ఉంటుంది.ఇక ఆగస్ట్, సెప్టెంబర్ మాసం అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ మాసం అనుకూలంగా లేదు. నవంబర్ మాసం మధ్యస్తంగా ఉంటుంది.డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి కూడా అంత అనుకూలంగా లేదు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications