Ugadi 2025 rashiphal: తులారాశి వారికి ఈ ఏడాది ఆకస్మిక ధనయోగాలు!
2025 సంవత్సరంలో మార్చి 30వ తేదీన తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ వస్తోంది. ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగం ప్రకారం ఏ రాశుల వారికి ఏ విధమైన ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. తమ తమ రాశుల వార్షిక ఫలితాలు తెలుసుకోవాలని కోరుకునే వారికి ఎంతోమంది జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఆ వివరాలను అందిస్తున్నారు.
తులారాశి వారికి ధనయోగాలు
విశ్వావసు నామ సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. తులారాశి జాతకులకు ఆదాయం 11 వ్యయం 5 గా ఉంటుంది. రాజపూజ్యం 2, అవమానాలు 2 గా ఉంటాయి. ఈ రాశివారికి మార్చి చివరలో శని ఆరవ స్థానంలోకి మారుతున్న కారణంగా వరుసగా అదృష్ట యోగం పట్టబోతుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా అనేక సందర్భాలలో ధన యోగాలు కలుగుతాయి.

తులారాశి వారికి ఆకస్మిక ధనలాభం
ఆకస్మిక ధన లాభానికి కూడా తులా రాశి జాతకులకు అవకాశం ఉంది. తులా రాశి వారికి ఈ ఉగాది నుండి ఏ పని చేసినా విజయవంతం అవుతుంది. ఆదాయం బాగా వృద్ధి జరుగుతుంది. తులారాశి జాతకుల ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు వస్తాయి. ఇంక్రిమెంట్లకు కూడా అవకాశం ఉంది. విదేశాలలో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి అవకాశాలు వస్తాయి.
తులారాశి వారికి అన్నింటా అభివృద్ధి
నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఇక తులా రాశి జాతకుల వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులతో సంబంధాలు ఏర్పడడం వల్ల ఏ విషయంలోనూ తులా రాశి జాతకులకు డోకా లేకుండా ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. విద్యార్థులకు కూడా ఇది సానుకూల సమయం. చదువుకునే వారు ఈజీగా విజయాలను సాధిస్తారు.
అప్పటి నుండి వీరి పురోగతి ఎవరూ ఆపలేరు
మే 18 వ తేదీన రాహువు కుంభరాశిలోకి, మే 25వ తేదీన గురువు మిధున రాశిలోకి మారిన తర్వాత నుంచి ఇక వీరి పురోగతిని ఎవరు ఆపలేరు. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంటాయి. షేర్లు స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభాలను ఇచ్చే అవకాశం ఉంది. ఇది తులా రాశి జాతకులకు అన్ని విధాలుగా మేలు చేసే సంవత్సరం.
disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల అంచనాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
వాస్తు ప్రకారం ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ అద్దాలున్నాయా? -
కుంభరాశి, మీనరాశి మే నెల జాతక ఫలం -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ..












Click it and Unblock the Notifications