Ugadi 2025 rashiphal: వృషభరాశి వారికి ఉగాది నుండి పట్టిందల్లా బంగారమే!
విశ్వావసు నామ ఉగాది సంవత్సరంలో వృషభ రాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతుంది? వృషభ రాశి వారు ఈ సంవత్సరం ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? వారికి ఈ ఏడాది అసలు కలిసి వస్తుందా లేదా? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
వృషభరాశి జాతకుల వార్షిక ఫలితం
వృషభ రాశి జాతకులకు ఈ సంవత్సరం ఉగాది నుండి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ రాశి వారికి గురు బలం ఉండడంతో ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతుంది. అదృష్ట లక్ష్మి వరిస్తుంది. రాహు, కేతువులు శుభస్థానంలో సంచరించడం వల్ల కూడా ప్రయోజనాలు పొందుతారు. శని లాభ స్థానంలో ఉండటం వల్ల సత్ఫలితాలు అందుతాయి. వృషభరాశి జాతకులకు ఇంటా బయట గౌరవం పెరుగుతుంది.

ఉద్యోగులకు ఇలా
ఈ సంవత్సరం మీరు ఏ పని ప్రారంభించినా అవలీలగా పూర్తి చేస్తారు. కొండంత మనోధైర్యంతో ముందుకు సాగుతారు. విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి ఉద్యోగులకు లాభదాయకంగా ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసే వారు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారు కూడా మంచి గుర్తింపును సాధిస్తారు. ఇక రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు వరించే అవకాశం ఉంది.
రాజకీయ నాయకులకు, కళాకారులకు ఎలా ఉంటుందంటే
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది అధిష్టానం నుంచి గౌరవాన్ని పొందుతారు కష్టానికి ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. కళా రంగంలో ఉండే వారికి ఈ ఏడాది నూతన అవకాశాలను ఇస్తుంది. గాయనీ గాయకులు, రచయితలకు వరుస అవకాశాలు లభిస్తాయి. అవార్డులు, రివార్డులు పొందుతారు. కళా రంగంలో ఉన్నవారు ఈ సంవత్సరం కష్టపడితే ప్రతిఫలం ఉంటుంది.
వర్తక వ్యాపారాలు చేసేవారికి ఇలా
ఇక వర్తక వ్యాపారాలు చేసే వృషభరాశి వారికి విశ్వావసు నామ సంవత్సరం కలిసి వస్తుంది. నూతన వ్యాపారాలు చేసే వారికి అనుకూల ఫలితాలు వస్తాయి. గృహ నిర్మాణ రంగంలో ఉండేవారు స్థిరాస్తులను వృద్ధి చేస్తారు. షేర్ మార్కెట్లో ఉండే వారికి లాభాలు వస్తాయి. విశ్వావసు నామ సంవత్సరంలో వ్యవసాయదారులకు లాభాదాయకంగా ఉంటుంది. క్రీడాకారులకు కలిసి వస్తుంది.
విద్యార్థులకు మంచి సమయం
విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఉన్నత చదువులు చదివే అవకాశాలు వస్తాయి. స్త్రీలకు విశేషమైన ఫలితాలు వస్తాయి. కుటుంబంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. ఉద్యోగాలు చేసే మహిళలకు కూడా ప్రమోషన్లు వస్తాయి. గ్రహాల అనుకూల సంచారంతో మీరు ఏది అనుకున్న ఈ సమయంలో కచ్చితంగా అయ్యి తీరుతుంది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: అనుకున్న పనులు నెరవేరతాయి.. నోరు అదుపులో ఉంచుకోవాలి -
వాస్తు ప్రకారం ఇంటి గోడల్లో దోషం ఉంటుందా? -
today rashiphalalu: ఆదాయం పెరిగి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి -
today rashiphalalu: భూమిని కానీ, వాహనాన్ని కానీ కొనుగోలు చేస్తారు -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!!












Click it and Unblock the Notifications