Ugadi 2025 rashiphal కన్యారాశివారు ఈ ఉగాది నుండి నక్కతోక తొక్కుతున్నారు!

త్వరలోనే విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. మార్చి 30వ తేదీన ఉగాది నుండి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది ప్రారంభంతో అందరి జాతకాలు మారబోతున్నాయి. అయితే ఉగాది వస్తుందంటేనే తెలుగు వారంతా పంచాంగాన్ని తెలుసుకోవాలని తమ రాశుల వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకోవాలని ఆశపడతారు.

కన్యారాశి ఉద్యోగులకు ఇలా
ద్వాదశ రాశులవారికి వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ప్రముఖ జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత మనం కన్యారాశి వారి రాశి ఫలాలను గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి విశ్వావసు నామ సంవత్సరం కలిసి వస్తుంది. ఎంతోకాలంగా వెంటాడుతున్న సమస్యల నుంచి ఈ రాశి వారు ఉపశమనాన్ని పొందుతారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి.

Ugadi 2025 rashiphal Virgo zodiac sign year horoscope from ugadi

పొలిటీషియన్ లకు ఎలా ఉంటుందంటే
ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు వస్తాయి. పనికి తగిన గుర్తింపు ఉంటుంది. నిరుద్యోగులు ఎంతో కాలంగా చేస్తున్న నిరీక్షణకు ఫలితం వస్తుంది. ఇక కన్య రాశిలో ఉన్న రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం సానుకూల ఫలితాలు వస్తాయి. వీరి సేవలను అధిష్టానం గుర్తిస్తుంది. పదవుల కోసం ఎదురుచూసే వారి కలలు ఫలిస్తాయి. డబ్బు ఖర్చయినప్పటికీ అన్నింట మీదే పైచేయిగా ఉంటుంది.

కళాకారులకు మిశ్రమ ఫలితాలు
ఇక ఈ సంవత్సరం కన్యారాశిలో ఉన్న కళాకారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రావలసిన అవార్డులు చివరి నిమిషంలో చేయి జారిపోతాయి. వివాదాస్పద విషయాలలో చిక్కుకొని ఇబ్బందులు పడతారు. అయినా వాటి నుంచి బయటపడతారు. విశ్వావసు నామ సంవత్సరంలో వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. హోల్సేల్, రిటైల్ వ్యాపారులకు ఇది సానుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చే సమయం.

వ్యాపారం చేసేవారికి ఇలా ఉంటుంది
భాగస్వామ్య వ్యాపారం చేసే వారి మధ్య భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక పరిశ్రమల నడుపుతున్న వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. విశ్వావసు నామ సంవత్సరంలో విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఏ పరీక్షలు రాసినా మంచి ఫలితాలను పొందుతారు. అయితే శని, రాహువు ప్రభావం వల్ల మీరు పక్కదారి పట్టే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి.

రైతులకు, స్త్రీలకు ఈ ఏడాది ఇలా
విశ్వావసు నామ సంవత్సరంలో రైతులకు రెండు పంటలు పండుతాయి. మంచి లాభాలతో ఆర్థిక సమస్యల నుంచి రైతులు బయటపడతారు. అప్పులు తీరి సంతోషంగా జీవిస్తారు. ఇక క్రీడాకారులు కూడా ఉత్తమ ప్రతిభను కనబరుస్తారు. కన్యారాశి స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. కాస్త ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగాల్లో ఉండే స్త్రీలకు ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి. మొత్తంగా విశ్వావసు నామ సంవత్సరం కన్యా రాశి వారికి అసలైన ఆనందానికి తెర తీస్తుంది.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+