Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం

తెలుగు నూతన సంవత్సరం అంటే ఉగాది పర్వదినం. ఈనెల 19వ తేదీ గురువారం పండగ జరుపుకుంటాం. మనకు తిథుల లెక్క ప్రకారం పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. 18వ తేదీతో క్రోధి నామ సంవత్సరం ముగుస్తుంది. 19న పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. చైత్రశుద్ధ పాడ్యమి రోజు పండగను జరుపుకుంటాం. తల స్నానం చేసి, నూతన వస్త్రాలను ధరించి, మన సంప్రదాయం ప్రకారం పంచె ధరించాలి. దేవాలయాలను సందర్శించుకొని షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని తీసుకోవాలి.

ఇందులో 6 రకాల రుచులు కలిసి ఉంటాయి. తీపి, పులుపు, చేదు, కారం, ఉప్పు, వగరు తీసుకోవడంవల్ల కొత్త సంవత్సరంలో, మన జీవిత పయనంలో ఎదురయ్యే అనేకరకాల సవాళ్లను అధిగమించడం, ఎదుర్కునే అనుభవాలన్నీ కొన్ని తియ్యగా, కొన్ని చేదుగా, కొన్ని వగరుగా.. ఇలా ఉంటాయని, అన్నింటినీ సమపాళ్లలో స్వీకరించాలని పండితులు చెబుతారు. తర్వాత సాయంత్రం పండితులు చెప్పే పంచాంగ శ్రవణాన్ని వింటాం. ఆ ప్రకారం కొత్త సంవత్సరం ఏవిధంగా ఉండబోతోంది అనే విషయంలో ఒక స్పష్టతకు వస్తాం. మనకు తెలుగులో 12 రాశులుంటాయి. వీటిని ద్వాదశ రాశులు అంటారు. ఉగాది అనగానే కొత్త సంవత్సరంలో తమకు చాలా బాగుంటుందనే ఆశతో ఎంతోమంది రాశులవారు ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం మీన రాశి వారికి ఉగాది నుంచి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

Ugadi The horoscope predictions for Pisces and Aquarius for the Telugu New Year are very promising

మీన రాశి - పరాభవ నామ సంవత్సరం (19.03.2026 - 06.04.2027)

ఆదాయం: 14
వ్యయ: 9
రాజపూజ్యం: 8
అవమానం: 2

పరాభవ నామ సంవత్సరం మీన రాశి వారికి అత్యంత శుభకరంగా ఉంటుంది, ఆదాయంలో గణనీయమైన పెరుగుదల కనపడుతుంది. గతంలో చేసిన కృషికి ఇప్పుడు ఫలాలు అందుతాయి. కొత్త వ్యాపారం, సృజనాత్మక పనులు, విదేశాల్లో మంచి లాభం సాధ్యమే. ఖర్చులు తగ్గుతాయి. పెట్టుబడులకు మంచి అవకాశాలు లభిస్తాయి. భూమి, బంగారం, భూమి లాంటి శాశ్వత ప్రాజెక్టులలో లాభాలుంటాయి.

ఉద్యోగంలో గౌరవం లభిస్తుంది. ఉన్నతాధికారుల విశ్వాసం పొంది ప్రధాన బాధ్యతలు మీ చేతుల్లోకి వస్తాయి. పదోన్నతి లేదా జీతం సాధ్యమే. సొంత వ్యాపారంలో ఉన్నవారికి కొత్త వినియోగదారులు దొరుకుతారు. విస్తరణకు అవకాశం లభిస్తుంది. కుటుంబ జీవితంలో సంతోషం, శాంతి ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. దాంపత్యంలో ప్రేమ, పరస్పర మద్దతు. వివాహితులకు వివాహ యోగం కనిపిస్తుంది. పరీక్ల ల్లో విజయం, ఉన్నత విద్యకు అవకాశం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంది. యోగ, ధ్యానం, నియమిత వ్యాయామం ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది.

ధార్మిక కార్యాలు, గురు పూజ, దాన ధర్మాలు, తీర్థయాత్రలు విశేష శుభఫలాలను అందజేస్తాయి. ఆధ్యాత్మిక చింతనలు జీవితానికి ఒక దిక్కుని స్పష్టం చేస్తాయి. మొత్తంగా ఈ సంవత్సరం మీన రాశివారికి పనితీరు, గౌరవం, ఆర్థిక సమృద్ధి, మానసిక సంతోషాన్ని అందించే అద్భుతమైన సంవత్సరం అని చెప్పొచ్చు.
=====================

కుంభ రాశి - పరాభవ నామ సంవత్సర (19.03.2026 - 06.04.2027)

ఆదాయం: 13
వ్యయ: 11
రాజ పూజ్యం: 7
అవమానం: 2

పరాభవ నామ సంవత్సరం కుంభ రాశివారికి పురోగతి, కొత్త ఆలోచనలు, పని సాధనకు అవకాశం కల్పిస్తుంది. ఆదాయంలో పెరుగుదల. కొత్త వ్యవహారాలు, సాంకేతికత లేదా సృజనాత్మక కార్యాల వల్ల లాభం సాధ్యం, ఖర్చు నియంత్రణలో ఉండటం వలన నిల్వ. దీర్ఘకాలిక పెట్టుబడులు మంచి ఫలం ఇచ్చే సూచన ఉంది. ఉద్యోగ రంగంలో పదోన్నతి లేదా ప్రముఖ బాధ్యతలు లభిస్తాయి. మీ కొత్త ఆలోచనలు, విభిన్న దృక్కోణం ఉన్నతాధికారుల దృష్టి ఆకర్షిస్తుంది. విదేశాలకు సంబంధించిన పనులు లేదా ఆన్‌లైన్ వ్యవహారాల్లో విజయం సాధ్యమవుతుంది. వ్యాపారస్థులకు భాగస్వామ్యం, విస్తరణ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.

కుటుంబ జీవితంలో సంతోషం, సమన్వయం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో ప్రేమ, పరస్పర గౌరవం పెరుగుతుంది. పరీక్షలలో ఉత్తీర్ణత, ఉన్నత విద్యకు అవకాశం లభిస్తుంది. ఆరోగ్యం సాధారణంగా మంచిది. అయితే నిద్రాభంగం లేదా మానసిక ఒత్తిడి ఉంటేప్ప యోగ, ప్రాణాయామం ఉపకారిగా ఉంటుంది.

ధార్మిక యాత్ర, గురు పూజ లేదా దాన ధర్మాలు ఎక్కువ శుభఫలాలు అందజేస్తాయి. శత్రువుల మీద మీ స్థానాన్ని మరింతగా సాధించవచ్చు. మొత్తంగా ఈ సంవత్సరం కుంభ రాశి వారికి గౌరవం, ఆర్థిక వృద్ధి, సమగ్ర విజయాన్ని సాధించిపెట్టే గొప్ప సంవత్సరం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+