జూన్ 30 వరకు ఈ రాశులవారి జీవితం కష్టాలమయం!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు తన రాశిని మార్చి కర్కాటకంలోకి ఎంటరయ్యాడు. శని నుండి ఆరో స్థానంలో అంగారకుడున్నాడు. దీనివల్ల షడష్టక యోగం ఏర్పడుతోంది. ఇది చాలా అశుభకరమైన యోగం. జూన్ 30 వరకు ఉండే ఈ యోగ సమయంలో కొన్ని రాశులవారు తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు. అవి ఏయే రాశులో తెలుసుకుందాం.

సింహ రాశి: షడష్టక యోగం వల్ల సింహరాశి వారు ఇక్కట్లకు గురవుతారు. పనిచేసే చోట హచరులతో విభేదాలు వస్తాయి.. తద్వారా వివాదాల్లో చిక్కుకుంటారు. ఖర్చులు ఊహించనిరీతిలో పెరగడంతోపాటు అనారోగ్యానికి గురవుతారు. వైవాహిక జీవితంలో సమస్యలు ప్రారంభమవుతాయి. అలాగే కెరీర్ పరంగా అనేక అడ్డంకులను ఎదుర్కొంటారు. డబ్బులు ఖర్చుచేసే విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.

 zodiac sign

ధనుస్సు రాశి: షడష్టక యోగం ధనుస్సు రాశి వారికి సమస్యలను తెచ్చిపెడుతుంది. దీనివల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు. అంతేకాకుండా మోసపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందులోను పెట్టుబడి పెట్టకుండా మౌనంగా ఉండటం ఉత్తమం. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తుతాయి. ఏ పని తలపెట్టినా అడుగు ముందుకు పడదు. జరుగుతున్న పనులన్నీ ఆగిపోతాయి.

కర్కాటక రాశి: కుజుడు ఇదే రాశిలో ఉండటంవల్లే షడష్టక యోగం ఏర్పడుతోంది. దీని ప్రభావం ఈ రాశివారిపై ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తుతాయి. డబ్బు లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆస్తి విషయంలో వివాదాలు తలెత్తుతాయి.

కుంభరాశి: డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ రాశివారికి ఈ సమయం అస్సలు కలిసిరాదు. దాంపత్య జీవితంలో అపార్థాలు తలెత్తుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+