valentine's day 2024: ప్రేమబంధం అందంగా, శాశ్వతంగా ఉండటానికి వాస్తు చిట్కాలు!!

సృష్టి మొత్తం ప్రేమతోనే ముడిపడి ఉంది. ప్రేమలేని చోటే లేదు. తల్లి బిడ్డలకు మధ్య ప్రేమ, భార్యాభర్తలకు మధ్య ప్రేమ, అన్నాచెల్లెళ్లకు మధ్య ప్రేమ.. ఇలా ప్రేమతోనే సృష్టిలోని ఏ బంధమైనా పెనవేసుకొని ఉంది. అటువంటి ప్రేమకు ప్రత్యేకంగా స్థానాన్ని కల్పిస్తూ నిర్వహించుకునే ది వాలెంటైన్స్ డే. వాలెంటెన్స్ డే సందర్భంగా ప్రస్తుతం వాలెంటైన్ వీక్ కొనసాగుతుంది. ప్రేమికులు తమలోని ప్రేమ భావాన్ని వ్యక్తం చేస్తూ వేడుకలకు సిద్ధమయ్యారు.

ఇక ఈ సమయంలో ప్రతీ ఒక్కరి జీవితంలో ప్రేమ భావన చెక్కు చెదరకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో ప్రేమ శాశ్వతంగా ఉండాలంటే ఏం చేయాలి? భార్యాభర్తల మధ్య ప్రేమ బలోపేతం కావాలంటే ఎలాంటి వాస్తు చిట్కాలు పాటించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. జీవిత భాగస్వామితో ప్రేమ బలపడాలంటే కొన్ని వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించాలి.

valentines day 2024: Vastu tips to make love beautiful and long lasting!!

ఇంట్లో స్థానికుల శక్తి ఉన్నప్పుడు కుటుంబసభ్యుల మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి. అలా కాకుండా ఇంట్లో వాస్తుదోషాలు ఉంటే ప్రేమ బంధాలలోను బీటలు వారే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ వాస్తుదోషాలను తొలగించుకోవడానికి కొన్ని వాస్తు చిట్కాలను పాటించాలి. భార్య భర్తల మధ్య ప్రేమ బంధం బలపడాలంటే బరువైన వస్తువులు పడకగదిలో ఉంచకూడదు. ఒకవేళ బెడ్ రూమ్ లో బరువైన వస్తువులు ఉంటే ఇంటి దక్షిణం లేదా పశ్చిమ గోడవైపు అమర్చుకోవాలి.

ఇక ఇంట్లో కొనుగోలు చేసే ఫర్నిచర్ విషయంలో చెక్క అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కొన్ని రకాల చెక్కలు శుభాలు చేకూరిస్తే, మరికొన్ని రకాల చెక్కలు అశుభాలకు కారణమవుతాయి. రోజ్ వుడ్ తో కానీ, టేకు తో కానీ, గంధం, అశోక, అర్జున, వేప చెక్కతో కానీ చేసిన ఫర్నిచర్ ను కొనుగోలు చేస్తే ఇంటికి శుభం చేకూరుతుంది. భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది.

బెడ్రూంలో ఎప్పుడు తాజా పువ్వులు ఉంచుకోవడం వల్ల, ఎప్పుడు సుగంధ భరితంగా చేసుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ బంధం బలపడుతుంది. భార్యాభర్తలు పడుకునే బెడ్ ముందు అద్దం లేకుండా చూసుకోవాలి. ఒకవేళ బెడ్ కి ఎదురుగా అద్దం ఉంటే వారి ప్రేమ బీటలు వారుతుంది. బెడ్ రూమ్ లో గది గోడలకు లేత రంగులనే వేయాలి. గులాబీ రంగు లేదా లేత పీచ్ కలర్ ప్రేమను మరింత పెంచుతాయి కనుక జీవితంలో ప్రేమ బంధం బలంగా ఉండాలన్న వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించాలి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+