వాస్తు దోషాలను గుర్తించడం ఎలా? సరిచేసుకోవడం ఎలా?
ప్రతి నిర్మాణానికి వాస్తు చాలా ముఖ్యం. అతి ప్రాచీన కాలం నుంచి మనకు వాస్తు శాస్త్రం అందుబాటులో ఉంది. దీన్ని మన పెద్దలు పూర్వీకుల ద్వారా అందించారు. ఆ ప్రకారం నిర్మాణం జరుపుకుంటే అందులో నివసించేవారంతా ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా.. ఇలా అన్నిరకాలుగా బాగుంటారని, అందుకే వాస్తును అనుసరించాలని చెబుతారు. అయితే ఇంట్లో వాస్తు దోషాలున్నాయని గుర్తించడం ఎలా? వాటిని సరిచేసుకోవడం ఎలా? అని చాలామంది సందేహం వస్తుంటుంది. వాస్తవానికి సొంత ఇంటికే కాకుండా అద్దె ఇంటికి కూడా వాస్తు ఉంటుంది. ఈ వివరాలన్నింటినీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.
భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి.. ఈ ఐదింటిని పంచభూతాలు అంటారు. వీటిమీద ఆధారపడే మనం జీవిస్తున్నాం. వీటిమధ్య సమతుల్యత దెబ్బతిన్నప్పుడు వాస్తుదోషం వస్తుంది. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, మానసిక అనారోగ్యం లాంటివన్నీ కలుగుతాయి. దోషాలను గుర్తించి సరిచేసుకుంటే మంచి జీవితం మన సొంతమవుతుందని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.

దోషాలు గుర్తించడం ఇలా
ఈశాన్యం లో టాయిలెట్ లేదా వంటగది ఉండటం, భారీ సామాగ్రి పెట్టడం వల్ల కుటుంబ అభివృద్ధి కుంటుపడుతుంది.
నైరుతిలో ప్రధాన ద్వారం ఉండటం లేదా గోడలు పల్లంగా ఉండటం వల్ల ఆర్థిక నష్టం, అనారోగ్యం కలుగుతాయి.
ఆగ్నేయంలో నీరు నిల్వ ఉంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతాయి.
వాయువ్యంలో దోషం ఉంటే శత్రువుల భయం లేదా మానసిక అశాంతి కలుగుతుంది.
దోషాలు సరిచేసుకోవడం ఇలా
ప్రతి దోషానికి గోడలు పడగొట్టాల్సిన అవసరం లేదు. కొన్ని చిన్న మార్పులతో వీటిని సరిచేసుకోవచ్చు.
ఒక గిన్నెలో సముద్రపు ఉప్పును వేసి ఇంటి మూలల్లో (ముఖ్యంగా టాయిలెట్స్‌లో) ఉంచండి.
ఇది నెగటివ్ ఎనర్జీని పీల్చుకుంటుంది.
వారం తర్వాత ఆ ఉప్పును మార్చాలి.
అలా వారం వారం మారుస్తూ ఉండండి.
వాస్తు పిరమిడ్లను దోషం ఉన్న చోట ఉంచడం వల్ల ఆ దిశలోని నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది.
ఇంటి ప్రధాన ద్వారంపై లోహం లేదా గంధంతో చేసిన స్వస్తిక్ గుర్తును ఉంచడం వల్ల శుభం చేకూరే ఫలితాలు ఉంటాయి.
ఈశాన్యం మూలలో ఒక చిన్న పాత్రలో నీరు పోసి, అందులో కొన్ని పూలు వేయండి. ఇది సానుకూల శక్తిని పెంచుతుంది.
ఇంట్లో కర్పూరం వెలిగించడం వల్ల గాలిలోని దోషాలు తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది.
దోషం ఉన్న దిశలో అద్దాన్ని సరైన విధంగా అమర్చడం వల్ల నెగెటివ్ ఎనర్జీని మళ్లించవచ్చు.
అయితే, అద్దాలను పడకగదిలో మంచానికి ఎదురుగా ఉంచకూడదు.
ముఖ్యమైన సూచనలు
ఇంటి మధ్య భాగం ఖాళీగా, శుభ్రంగా ఉండాలి.
ఇంట్లోకి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా చూడండి.
చీకటిగా ఉండే గదులు నెగటివ్ ఎనర్జీని పెంచుతాయి.
ఇంట్లో తులసి మొక్కను పెంచడం ద్వారా అనేక వాస్తు దోషాలు తొలగిపోతాయి.












Click it and Unblock the Notifications