వాస్తు ఇంటికే కాదు.. వీటికి కూడా ఉంటుంది.. తెలుసుకోండి!
వాస్తు అనగానే అందరూ ఇంటికి, కార్యాలయానికి ఉంటుందని అనుకుంటారు. అయితే వీటికే కాకుండా వివిధ అంశాలకు కూడా వాస్తు ఉంటుందనే విషయం తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. వాస్తు లోపాలుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది.. ఆర్థిక సమస్యలు వస్తాయి.. అయితే వివిధ అంశాల్లో ఉండే వాస్తు లోపాలేంటి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం.
నీళ్లు ఉండే చోట చెత్త ఉండకూడదు.
ఈశాన్యం దిశలో చెత్తాచెదారం అసలు ఉండకూడదు.
బావులు, సంపులు, పంపులు దక్షిణానికి, పశ్చిమానికి మధ్య ఉండకూడదు.
ఇలా ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుంది.

వాషింగ్ మెషిన్, వాష్ బేసిన్, నీరు ఉండేవి పడమర, దక్షిణం అసలు పెట్టకూడదు.
ఔషధాలు కూడా ఈ దిశలో ఉంచకూడదు.
అనారోగ్యంతో బాధపడేవారి మందులను దక్షిణం వైపు పెట్టకూడదు.
మందులను ఈశాన్యం లేదంటే ఉత్తర దిశల్లో పెట్టాలి.
బరువుగా ఉండే వస్తువులు, పెద్ద పెద్ద వస్తువులు ఈశాన్యంలో పెట్టకూడు
ఇలా ఉంటే కుటుంబంలోని వ్యక్తులకు అనారోగ్యం కలుగుతుంది.
ఇంట్లో దక్షిణ దిశను శుభప్రదంగా ఎవరూ భావించరు.
ఆ దిశగా కాళ్లు పెట్టి పడుకోకూడదు. లేదంటే అనారోగ్యం కలుగుతుంది.
దక్షిణ దిశలో ఫీనిక్స్ పక్షి ఫొటోను ఉంచడం ఉత్తమం.
ఈ దిశలో పూర్వీకుల చిత్రాలు ఉంచితే శుభం జరుగుతుంది.
ఈ దిశలో యంత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంచకూడదు.
చెప్పులు, బూట్లు దక్షిణ దిశలో విడవకూడదు.












Click it and Unblock the Notifications