వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu plant: ఈ చిన్న మొక్కను మీ ఇంటికి ఉత్తర దిశలో పెంచుకోండి!!

|
Google Oneindia TeluguNews

వాస్తు శాస్త్రంలో చెట్లు, మొక్కలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఇంట్లో నాటిన చెట్లు, మొక్కలు పురోగతిని, సంతోషాన్ని, మనిషికి శ్రేయస్సును కలిగిస్తాయని నమ్ముతారు. ప్రతి ఇంట్లో ప్రతికూల శక్తులు ఉంటాయి. వాటిని తరిమివేయడానికి సరైన దిశలో, సరైన స్థలంలో మొక్కలు నాటడం అవసరమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాస్తులో తులసి మొక్క, దాని ప్రాధాన్యత గురించి అందరికీ తెలిసిందే. అలాగే తులసి మొక్కే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందేందుకు మరికొన్ని మొక్కలున్నాయని, అలాంటిదే వెదురు మొక్క అని తెలుపుతున్నారు.

దీన్ని ఇంట్లో పెడితే నెగెటివ్ ఎనర్జీ ఉండదు. వెదురు మొక్కను నాటడంవల్ల వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో కుటుంబ సభ్యులంతా కలిసి ప్రతిరోజు ఎక్కడైతే కూర్చుంటారో అక్కడ దీన్ని నాటాలి. హాలు కానీ, డ్రాయింగ్ రూమ్ లోకానీ ఈ మొక్కను ఉంచవచ్చని చెబుతున్నారు. దీన్ని ఉత్తరంలో ఉంటే కలిసి వస్తుందని చెబుతున్నారు.

 vastu plant bamboo in the right direction

కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ఇది ప్రభావం చూపుతుంది. ఏవైనా అడ్డంకులు ఎదురైనప్పుడు వెదురు కాడను ఎర్రటి గుడ్డలో చుట్టి గాజు పాత్రలో ఉంచాలి. అయితే ఈ వెదురు కొమ్మ పొడిగా ఉండకూడదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోతే ఆ ఇంట్లో వెదురు మొక్కను నాటాలి. దీనివల్ల ధన లాభం కలుగుతుంది. అంతేకాకుండా విద్యార్థులు విద్యపై పూర్తిస్థాయిలో దృష్టిసారించేందుకు వెదురు మొక్కను పెంచుకోవాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు. చదువుకునే పిల్లలు ఉన్న గదిలో 4 చిన్న మొక్కలు నాటితే వారి మనసు చదువుపైకి మళ్లుతుందని తెలిపారు. ప్రయోజనాలు పొందాలి అంటే దీన్ని సరైన దిశలోనే నాటాలి. సానుకూల శక్తిని పెంచుకోవడంతోపాటు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.

English summary
Trees and plants are very important in Vastu Shastra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X