వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తర వీధి స్థలం అశుభమా?: దాని వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుందా..

ఉత్తర భాగము యింటి యందు నివసించు ఆడవారి పైనను మరియు ధనాదాయము పై పనిచేయును.

|
Google Oneindia TeluguNews

ప్లాటునకు ఉత్తరము ఒకేవైపు వీధి గల స్థలమును ఉత్తర వీధిస్థల మందురు.

ఉత్తర భాగము యింటి యందు నివసించు ఆడవారి పైనను మరియు ధనాదాయము పై పనిచేయును. ఉత్తర సింహద్వార గృహమునకు సింహద్వారము వీధిలోనికి కనబడునటు కాంపౌండ్ గోడ నిర్మించవలెను. కాంపౌండ్ గోడ ఉత్తరంవైపు ఇలు పూర్తి అయిన తరువాత నిర్మాణము చేయవలెను.

ఉత్తరమున ఖాళీస్థలము తక్కువగా నుండి దక్షిణమువైపు అది ఎక్కువగా నున్నచో ఆ యిలు తరుచు అమ్మకానికి రావడమో లేదా యింటి యజమాని అమ్ముదామని ప్రయత్నము చేసినను కొనువారు రాక యజమాని చాలా ఇబ్బందులు పడవలసి వచ్చును.ఇంటి ఉత్తరం వైపు మేడ వేసినచో ఆ యింటి యజమాని తీవ్రరోగ గ్రస్తుడగును.

అందువలన యజమానురాలు సుఖము లేక చాలా ఇబ్బందుల పాలగును. వంట రూము ఆగ్నేయములో ఏర్పాటు చేసుకొనుట మంచిది.ఉత్తర ఈశాన్యము తెగిపోయిన గాని, తగ్గినాగాని ఆ ఇంట సంతతి లేక, ఒకవేళ ఉన్నా ఆడ సంతతి మాత్రముండి ఆ గృహం దత్తుతో ఆస్తి ఇతరులదిగా మారిపోవును.

Vastu Shastra North Street Focus to House

ఇంటికి, ఇంటి ఆవరణకు ద్వారాలు ఉచ్ఛస్థానములో నుండునటు అనగా ఉత్తర ఈశాన్యములో నుండునటు ఏర్పాటు చేసుకొనవలెను.

ఇంటిని అద్దెకు యిచ్చువారు, ఇంటికి ఉచ్ఛపు వాటలో తాము నివసించుతూ నీచపు వాటాను అద్దెకు ఇచ్చుకోవలెను. అద్దెకు ఉన్నవారు ఖాళీ చేసిన వెంటనే
వేరొకరికి అద్దెకు చేర్చుకొనవలెను. అలా వీలు కాని ఎడల అట్టిభాగమును తాము ఉపయోగించు కొనవలెను.

ఉత్తర భాగములో వంటగది ఏర్పాటు చేసుకొనకూడదు.
ప్లాటు నందు ఉత్తర భాగము పల్లముగానున్న ఆయింటి ముందు సంపదలకు లోటుండరు. ఆడవారు సుఖశాంతులతో నుందురు.

దక్షిణ భాగము కంటే ఉత్తర భాగము రెట్టింపు ఖాళీగా నుండు నటు గృహ నిర్మాణము చేసుకొనవలెను.ఇంటికి ఉత్తర భాగమందు వసారాలు వంచి నిర్మించవలెను.
అరుగులు ఉత్తర భాగమందు నిర్మించదలచినవి ఇంటి ఫ్లోరింగ్ లెవెల్ కన్న తక్కువగా నుండవలెను.

ప్లాటు నందు ఉత్తరభాగము ఎత్తుగా నున్న ఆ యింట సిరిసంపదలు దినదినమునకు తరిగి పోవుటయో లేక ఆ యింటి యందు నివసించు స్త్రీలు అనేక రోగాలకు గురియగుచుండుట జరుగును.

ఉత్తర భాగములో తలుపులు (Doors) వాయువ్యమును చూచుచున్నటైతే యింటికి దొంగతనం, అగ్ని భయం మొదలైన భయాలు కలుగును.
ఉత్తరం హద్దు మీద ఏ రకాలైన కట్టడాలు అనగా మెట్లు గాని, లెట్రిన్, బాత్రూమ్ లాంటి నిర్మాణములు చేయకూడదు.

ఉత్తర వీధి స్థలమునకు ఈశాన్య వీధిపోటు ఉండిన ఆ ఇల్లు సిరిసంపదలతో తులతూగుచుండును. వారికి బ్రతుకుదెరువుకు ఎలాంటి లోటు వుండదు.గృహమునకు ఈశాన్యంలో బావినిగాని బోరింగ్గాని ఏర్పాటు చేసుకొనవలెను. ఈశాన్యపు నడక వచ్చునటు గృహము నిర్మించవలెను.

English summary
If one Street strikes from North direction to a property it is called as North Street Focus or North Road thrust or Street focus from North direction and that house is called as "North Street Focus House".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X