vastu tips: సూట్‌కేసును ఖాళీగా ఉంచకుండా ఈ ఒక్క వస్తువు పెట్టండి

Vastu: సూట్‌కేస్‌లను ఉపయోగించిన తర్వాత పూర్తిగా ఖాళీ చేసి అల్మారాల్లో లేదా మంచాల కింద పడేస్తున్నారా? మనం నిత్యం ప్రయాణాలకు వాడే సూట్‌కేసులు, ట్రావెల్ బ్యాగుల విషయంలో మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఇంట్లో ప్రతికూల శక్తికి కారణమవుతాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో ప్రతి వస్తువుకూ ఒక నిర్దిష్టమైన దిశ, ప్రాధాన్యత ఉంటాయి.

ఖాళీ సూట్‌కేస్ - ఆర్థిక శూన్యతకు సంకేతమా?

ప్రయాణం ముగియగానే బట్టలన్నీ తీసేసి, సూట్‌కేస్‌ను పూర్తిగా ఖాళీగా దాచిపెట్టే అలవాటు చాలామందికి ఉంటుంది. కానీ, వాస్తు నమ్మకాల ప్రకారం పూర్తిగా ఖాళీగా ఉండే సూట్‌కేస్‌ను ఇంట్లో ఉంచడం ఆర్థిక శూన్యతకు ప్రతీకగా భావిస్తారు. అందుకే సూట్‌కేస్‌ను ఖాళీగా ఉంచకుండా, అందులో ఒక రూపాయి నాణెం, నోటు, వెండి నాణెం లేదా కనీసం ఒక క్రొత్త వస్త్రం ఉంచాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం నిలిచి, సంపద, అభివృద్ధి కలుగుతాయని నమ్ముతారు.

Vastu tips According to principles Instead of leaving the suitcase empty put this one item in it

ఇంట్లో సూట్‌కేసులు ఎక్కడ ఉంచాలి?

స్థలం సరిపోలేదనే కారణంతో చాలామంది సూట్‌కేసులను మంచం కింద తోసేస్తుంటారు. కానీ ఇది ఇంట్లో నిద్రలేమి, మనశ్శాంతి లోపించడానికి దారితీస్తుందని వాస్తు చెబుతోంది. భారీగా ఉండే సూట్‌కేసులు, ట్రావెల్ బ్యాగులను ఎప్పుడూ ఇంటికి నైరుతి లేదా పడమర దిశల్లో ఉండే అల్మారాలు లేదా స్టోరేజ్ రూమ్‌లలో మాత్రమే భద్రపరచాలి. తూర్పు, ఉత్తర దిశలను ఎప్పుడూ ప్రశాంతంగా, తేలికగా ఉంచుకోవడమే శ్రేయస్కరం.

పాడైన బ్యాగులు ఉంచుతున్నారా?

జిప్పులు ఊడిపోయినవి, చక్రాలు విరిగిపోయినవి, చిరిగిపోయిన సూట్‌కేసులను "ఎప్పుడో ఒకప్పుడు పనికొస్తాయిలే" అని ఇంట్లో దాచిపెట్టడం అరిష్టం. పనికిరాని వస్తువులు పేరుకుపోవడం వల్ల ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. వాటిని వెంటనే బాగు చేయించడం లేదా ఇంటి నుండి తొలగించడమే మంచిది. ప్రయాణం ముగిసిన వెంటనే బ్యాగులను బాగా తుడిచి, తేమ లేకుండా పొడిగా ఉండేలా చూసుకుని దాచుకోవడం వల్ల అటు ఆరోగ్యం, ఇటు ఇంటి వాతావరణం రెండూ బాగుంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+