కలల్లో కాకులు.. శుభమా.. అశుభమా? తెలుసుకోండి!!

కలలకు మన జీవితానికి అవినాభావ సంబంధం ఉంటుంది. కలల్లో కనిపించే కొన్ని సంఘటనలు మన నిజ జీవితంలో భవిష్యత్ లో జరిగే అనేక సంఘటనలకు సూచనగా చెబుతారు. స్వప్న శాస్త్రంలో కలల్లో వచ్చిన వస్తువులు, వచ్చిన జంతువులు, వచ్చిన వివిధ సంఘటనలకు ఒక అర్థం తప్పనిసరిగా ఉంటుంది.

కలలో కాకులు కనిపిస్తే దాని పర్యవసానం ఏ విధంగా ఉంటుంది. అసలు కాకులు కనిపిస్తే మంచిదా కాదా? ప్రస్తుతం మనం తెలుసుకున్నాం.నిజానికి కాకిని అశుభాలను సూచించే పక్షిగా పరిగణిస్తారు. కలలో కాకులను చూడడం దురదృష్టమని, అశుభమని చాలామంది చెబుతూ ఉంటారు. కాకి శని గ్రహానికి సూచనగా కూడా చెబుతారు.

vastu tips: crows in dreams.. auspicious or inauspicious? know this!!

కాకికి మృత్యుదేవత తోను, యమధర్మరాజు తోను సంబంధం ఉంటుందని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే కలలో కాకులు భయానకంగా శబ్దం చేస్తూ కనిపిస్తే మంచి సంకేతం కాదని చెబుతారు. ఇంట్లో ఏదైనా చెడు జరగడానికి దీనిని సంకేతంగా భావిస్తారు. కాకి భయంకరంగా శబ్దం చేయడం మరణ సంకేతంగా చెబుతారు.

కలలో కాకి తలపై కూర్చున్నట్లుగా వస్తే అశుభ సూచకంగా భావిస్తారు. కలలో కాకి తలపై కూర్చోవడం కూడా మరణానికి సంకేతం. ఒకవేళ అటువంటిది జరిగితే ఏదైనా జరగరానిది జరగవచ్చునని చెబుతున్నారు. అంతే కాదు కలలో ఎగురుతున్న కాకి కూడా మంచిది కాదు. ఎగురుతున్న కాకి కలలో కనిపిస్తే అనేక మానసిక సమస్యలను ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంటుంది. అనేక ఇబ్బందులకు ఇది సూచిక అని చెబుతారు.

సమయం, డబ్బు రెండు వృధా అయ్యి, అనవసరపు గొడవలు, చిరాకులు కలుపుతాయని చెబుతున్నారు. ఇక కాకిని పట్టుకున్నట్టు కలగంటే ఒక మంచి తప్పక జరుగుతుందని చెబుతున్నారు. కాకిని పట్టుకున్నట్టు కలగంటే కుటుంబ అవసరాలు కూడా తీరతాయని చెబుతున్నారు. కలలోకి కాకులు వస్తున్నాయి అంటే పితృదేవతలకు సంబంధించి చెయ్యవలసిన క్రతువులను గుర్తు చేసినట్టుగా కూడా కొందరు చెబుతుంటారు. కలలో కాకులు కనిపించే విధానాలను బట్టి ఒక్కో దానికి ఒక్కో అర్ధం తప్పకుండా ఉంటుంది.

Disclaimer: ఈ కథనం వాస్తు నిపుణుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+