Vastu tips: ధననష్టం నివారించాలంటే స్టోర్ రూమ్ లో ఈ వస్తువులు అస్సలు పెట్టొద్దు!!
వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు ఏ విధంగా అయితే నిర్మాణం చేసుకోవాలో, ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తు శాస్త్ర నియమాలను పాటించాలి. ఇక ఇంట్లో ఉండే స్టోర్ రూమ్ విషయంలో చాలామంది అజాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. రోజువారి జీవితంలో ఉపయోగపడే ఎన్నో వస్తువులను స్టోర్ రూమ్ లో పడేస్తూ ఉంటారు. అయితే స్టోర్ రూమ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఆర్థిక నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది.
స్టోర్ రూమ్ లో వాస్తు లేకపోతే రాహు, కేతు గ్రహాలు ప్రతికూల ఫలితాలను ఆ ఇంట్లోని వారికి అందిస్తాయి. కాబట్టి స్టోర్ రూమ్ లో ఏ వస్తువులు పెట్టకూడదు అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. స్టోర్ రూమ్ లో తుప్పు పట్టిన వస్తువులను ఉంచకుండా చూసుకోవాలి. స్టోర్ రూమ్ లో తుప్పు పట్టిన వస్తువులు పెడితే అవి మన ఆర్థిక ప్రగతికి అడ్డుపడతాయి. ధన నష్టం కలిగిస్తాయి.

స్టోర్ రూమ్ లో ఉపయోగపడే వస్తువులు మినహాయించి, పాడైపోయిన వస్తువులను ఉంచవద్దు అని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు స్టోర్ రూమ్ లో ఇత్తడి పాత్రలను పడేయకండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇత్తడి పాత్రలో శని దేవుడు నివసిస్తాడు. ఒకవేళ స్టోర్ రూమ్ లో ఇత్తడి పాత్రలను పడవేస్తే శని ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాడు.
ఇక స్టోర్ రూమ్ లో పాడైపోయిన వాచ్ లు, కుట్టు మిషన్లు పడేయకండి. పూజగది సామాన్లను, వంటగది సామాన్లను స్టోర్ రూమ్ లో ఉంచకండి. దీనివల్ల పేదరికం వచ్చి పడుతుంది. స్టోర్ రూమ్ లో కత్తులు, కత్తెరలు వంటి హానికరమైన వస్తువులు పెట్టకూడదు. విరిగిపోయినవి ఏ విధంగాను పనికిరాని వస్తువులను కూడా స్టోర్ రూమ్ లో ఉంచడం మంచిది కాదు.
స్టోర్ రూమ్ కదా అని దానిని సర్దకుండా చెత్తాచెదారంతో నింపకండి. స్టోర్ రూమ్ ఆ విధంగా ఉంటే కూడా ఇంట్లో దరిద్ర లక్ష్మి తాండవిస్తుంది. స్టోర్ రూమ్ ని కూడా నీట్ గా సర్ది పెట్టుకోండి. అప్పుడే ఇంట్లో ప్రతికూల ఫలితాలు రాకుండా ఉంటాయి. స్టోర్ రూమ్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆర్థిక నష్టాల నుంచి బయటపడతారు.
disclaimer: ఈ కథనం వాస్తు నిపుణుల సలహాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications