Vastu tips: హోలీనాడు ఈ పనులు చేస్తే దరిద్రం పరార్!!
హోలీ పండుగ రోజున ఈ పనులు చేస్తే దరిద్రం తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది.
ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న రంగుల పండుగ హోలీ పండుగ రానే వస్తోంది. ఈ ఏడాది మార్చి 8వ తేదీన హోలీ పండుగ వస్తుంది. వసంత కాలంలో జరుపుకునే ఈ పండుగను ప్రతి ఒక్కరూ విశేషంగా జరుపుకుంటారు. దీపావళి తర్వాత దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో హోలీ పండుగ ముఖ్యమైనది.

హోలీ నాడు వాస్తు నియమాలు పాటిస్తే ధన లాభం
ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా హోలీ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున ప్రతి ఒక్కరు పేద, ధనిక, తరతమ బేధాలు మరిచి ఒకరికొకరు రంగులు పూసుకుంటూ జీవితం రంగులు మయం కావాలని కోరుకుంటారు. అయితే హోలీ పండుగ రోజున కొన్ని మనం పాటించవలసిన నియమాలు ఉన్నాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాటిని పాటిస్తే వాస్తు దోషాలు తొలగిపోవడంతో పాటు, పేదరికం పోయి సంపద వర్షం కురుస్తుందని చెబుతున్నారు.

హోలీ నాడు ఇంటి ప్రాంగణంలో ఈ పని చెయ్యండి
ఇంతకీ హోలీ పండుగ రోజు ఏం చేయాలంటే హోలీ పండుగ రోజు శ్రీమహావిష్ణువుని, శ్రీకృష్ణుడిని, రాధాదేవిని, శ్రీ మహాలక్ష్మిని విశేషంగా పూజించాలి. అంతేకాదు హోలీ పండుగ రోజున కొన్ని వాసు చిట్కాలను పాటించాలి. అలా పాటిస్తే సంవత్సరం అంతా ఆ ఇంట్లో సంతోషం వెల్లి విరుస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రవేశ ద్వారం వద్ద, లేదా గృహ ఆవరణంలో హోలీ పండుగను జరుపుకోవాలి. హోలీ ఆడుకోవడానికి కావలసిన రంగులను ఇంట్లోనే తయారు చేసుకోవాలి. ముఖ్యంగా ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, గులాబీ వంటి సంతోషాన్ని కలిగించే రంగులను మాత్రమే పూయాలి. ఇలా ఇంట్లో హోలీ ఆడుకోవడం వల్ల ఆ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇంటి పైన లక్ష్మీదేవి యొక్క ప్రత్యేకమైన ఆశీస్సులు ఉంటాయి.

గణేశుడికి హోలీ నాడు ఇలా పూజించండి
ఇక అంతే కాదు హోలీ పండుగ రోజు గణేశుడిని పూజించి, గులాబీ రంగును పూసి, గణేశుడికి ఇష్టమైన స్వీట్లు నైవేద్యంగా సమర్పించి హోలీ పండుగను జరుపుకోవాలి. అప్పుడు గణేశుడు సంవత్సరం అంతా జీవితం ఎటువంటి విజ్ఞాలు లేకుండా అన్ని పనులు నిర్విఘ్నంగా సాగేలా దీవిస్తాడు. ఇక అంతే కాదు హోలీ రోజు ఒక ప్రత్యేకమైన పని చేయడం వల్ల ఆ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

హోలీ నాడు ఈ ఒక్క పని చేస్తే ఇంట్లో ఆనందం
ఇంట్లోని దోషాలను తొలగించడంతోపాటు, పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడానికి హోలీ రోజున, ఇంటి లోపల, ఇంటి బయట, పచ్చని చెట్లను, మొక్కలను నాటాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఆనందం సంవత్సరం అంతా ఉంటుందని సూచిస్తున్నారు. ఇక హోలీ పండుగ నాడు వ్యాపారం అభివృద్ధి చెందడానికి, ధన లాభం కలగడానికి, ఇంటికి కానీ ఆఫీసులకు కానీ తూర్పున ఉదయించే సూర్యుడు చిత్రాన్ని ఉంచుకోవాలని, దీని వల్ల కూడా అదృష్టం ప్రకాశిస్తుందని చెబుతున్నారు.

హోలీ నాడు టెర్రస్ పైన ఈ పని చెయ్యండి
ఇక హోలీ పండుగ నాడు ఇంటి టెర్రస్ పై పెట్టుకున్న జై హనుమాన్ జండాను కానీ, శ్రీరామ జెండాను కానీ, బాలాజీకి సంబంధించిన జెండాలను కానీ మార్చడం శుభప్రణామంగా పరిగణించబడుతుంది. హోలీ పండుగ రోజున మనం పూజించే భగవాన్ జెండాను ఇంటికి పై ఎగరవేయడం వల్ల ఆ ఇంట్లో శ్రేయస్సు, సంతోషం పెరుగుతుందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే హోలీ పండుగ నాడు భగవంతుని పూజించటంతో పాటు, వాస్తు నియమాల ప్రకారం పండుగని సంతోషంగా జరుపుకొని సంతోషంగా జీవించొచ్చని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.












Click it and Unblock the Notifications