vastu tips: డబ్బుల కష్టాలు అరటిచెట్టుతో మాయం.. ఏం చెయ్యాలంటే!!

చాలామంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక మంచి వాస్తు సలహా చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అరటి చెట్టు మన ఇంట్లో వాస్తు దోషాలను తొలగించి, కుటుంబానికి శ్రేయస్సును, ఆర్థిక పుష్టిని ఇస్తుందని చెబుతున్నారు.

చెట్లు మరియు మొక్కలు హిందూమతంలో పూజించతగినవిగా పరిగణించబడతాయి. దేవతలు చెట్ల పైన ఉంటారని చెబుతారు. ప్రతి శుభకార్యం లోనూ మొక్కలను ఉపయోగిస్తారు. ముఖ్యంగా అరటి చెట్టును ప్రతి శుభకార్యములలోనూ ఉపయోగించటం మనం చూస్తూ ఉంటాం. తులసి ఆకులు, మామిడి ఆకులు, అరటి ఆకులు మొదలైనవి ఏ పూజలోనైనా ఉపయోగిస్తారు.

vastu tips: financial problems disappear with banana tree!!

అరటి చెట్టులో విష్ణువు నివసిస్తాడని నమ్ముతారు. విష్ణువును పూజించడం వల్ల విష్ణువు యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం కలుగుతుంది. అరటి చెట్టు యొక్క మూలాన్ని కూడా పవిత్రంగా భావిస్తారు . ఒక వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారినప్పుడు ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడుతుంటే అతడు అరటి చెట్టు యొక్క మూలానికి 11 సార్లు ప్రదక్షణ చేస్తే మంచి జరుగుతుందని చెబుతారు.

అరటి చెట్టు వేరులో బెల్లం, శనగపప్పు, పసుపు ముద్ద సమర్పించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. ఇంట్లో ప్రతికూలతలను తొలగించి సానుకూలతను తీసుకురావడానికి అరటి చెట్టు యొక్క మూలాలను ఇంటి ప్రధానద్వారానికి కట్టడం మంచిదని చెబుతున్నారు. ఇంట్లో ఆనందం మరియు శాంతి నెలకొల్పడానికి అరటి వేరుతో కలిపిన నీటిని ప్రతిరోజు సమర్పించినట్లయితే మంచి జరుగుతుందని చెబుతున్నారు.

అరటి చెట్టు వేరును పూజించడం వల్ల మంగళ దోషం తొలగిపోతుందని చెప్తున్నారు. ఒక వ్యక్తి వివాహం జరగకుండా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, అటువంటి వారు గురువారంనాడు పసుపురంగు దుస్తులు ధరించి పూజ చేయడం మంచిదని, ఫలితంగా అతనికి వివాహం జరుగుతుందని చెబుతున్నారు. ఇక ధనవంతులు కావాలనుకునేవారు ఎర్రటి గుడ్డలో అరటి వేరును కట్టి తన గదిలో ఉంచుకోవాలని ఇలా చేయడం వల్ల సదరు వ్యక్తి యొక్క ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుందని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+