Vastu tips: ఇంట్లో చిరాకులైనా, ఆఫీస్ సమస్యలైనా.. ఇది ఇంట్లో ఉంటే పరారే!!

చాలామంది ఎంత కష్టపడుతున్నా కూడా సరైన ప్రతిఫలం రాక బాధపడుతుంటారు.అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంది అన్నట్టు ఇంట్లో చిరాకు అనుభవిస్తూ ఉంటారు. ఆర్థికంగా ఇబ్బందులు లేకున్నా మానసిక సమస్యలు వారిని బాధిస్తూ ఉంటాయి. ఇక ఆఫీసులో పని చేస్తున్నా పనికి తగ్గ ఫలితం రాక నిత్యం నరకాన్ని చూస్తూ ఉంటారు.

అటువంటి వారు ఇంట్లో ఎక్కడో వాస్తు దోషాలు ఉన్నాయని, నర దృష్టి దోషాలు కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందని గుర్తించాల్సిన అవసరం ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఒక వస్తువును ఉంచుకుంటే అనేక సమస్యల నుండి పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో పటికను ఉంచుకోవడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

 Vastu tips: frustrations at home or problems at office.. keep this thing to solve them

ఇంట్లో కానీ ఆఫీసులో కానీ వాస్తు సంబంధితమైన సమస్య ఏదైనా ఉంటే దానిని తొలగించుకోవడం కోసం 50 గ్రాముల పటిక ముక్కలను తీసుకుని గదిలోని నాలుగు మూలలకు పెట్టాలి. అప్పుడు గదిలో ఉండే వాస్తు దోషాలు తొలగిపోతాయి. అయితే గదిలో మూలలకు పెట్టినప్పటికీ రంగు మారుతున్నట్లుగా గమనిస్తే, దానిని మళ్లీ కొత్త పటిక తో మారుస్తూ ఉండాలనే విషయం ప్రధానంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి.

అంతేకాదు మనసులో ఏదో తెలియని ఆందోళన తో బాధపడుతూ, సరిగ్గా నిద్ర పోలేక బాధపడుతున్న వారు నిద్రపోయే ముందు పటికను నల్ల గుడ్డలో కట్టి దిండు కింద పెట్టుకుంటే చెడు కలలు రావని, వారు తెలియని భయం నుండి విముక్తి పొందుతారని చెబుతున్నారు. అంతేకాదు ఇంట్లో ఉండే వాస్తు దోషాలను తొలగించుకోవడానికి ఇంటిని తుడిచే సమయంలో పటికను ఉపయోగించవచ్చని సూచిస్తున్నారు.

ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి, లాభాలు చేకూరడం కోసం పటిక ను వాడాలని సూచిస్తున్నారు. నరదృష్టి తొలగిపోవడానికి కొద్దిగా పటికను స్నానం చేసే నీటిలో చేర్చుకొని స్నానం చేస్తే కూడా మంచిదని చెబుతున్నారు. ఇది కుటుంబంలో సంతోషాన్ని, అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+