Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వాస్తు ప్రకారం మీ ఇంట్లో బాత్‌రూం ఏ దిక్కులో ఉందో పరిశీలించారా?

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో బాత్రూమ్ లేదా టాయిలెట్ నిర్మించేటప్పుడు ఏ దిక్కుల్లో కట్టుకోవాలనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. ఎందుకంటే నెగెటివ్ ఎనర్జీ అనేది మొత్తం పోగై ఉండేది బాత్‌రూంలోనే. తప్పుడు దిక్కుల్లో ఉంటే కనుక ఇంట్లోకి ఈ ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడున్న బాత్ రూం కూడా ఏ దిక్కులో ఉందో ఒకసారి పరిశీలించుకోండి.

వాయువ్యం
బాత్రూమ్ లేదా టాయిలెట్ నిర్మించడానికి ఇది ఉత్తమమైన దిశ.
ఇది ఇంటి బయట గోడకు ఆనుకుని వాయువ్య మూలలో ఉండటం శ్రేయస్కరం.

Vastu tips Have you checked which direction your bathroom is located in according to the principles

పశ్చిమం
వాయువ్యం కుదరని పక్షంలో పశ్చిమ దిశలో కూడా బాత్రూమ్‌ను నిర్మించుకోవచ్చు.

దక్షిణం
దక్షిణ దిశలో కూడా టాయిలెట్ నిర్మించవచ్చు.
అది నైరుతికి తగలకుండా చూసుకోవాలి.

ఈశాన్యం దిక్కులో బాత్రూమ్ ఉంటే
ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

నైరుతి దిక్కు పితృ మూల లేదా రాహువు స్థానం.
ఇక్కడ బాత్రూమ్ ఉంటే ఇంటి యజమానికి మానసిక ఒత్తిడి, అశాంతి కలుగుతాయి.
ఆగ్నేయం అగ్ని మూల. ఇక్కడ నీటితో ఉండే బాత్రూమ్ ఉండటం వల్ల వాస్తు దోషం ఏర్పడుతుంది.

టాయిలెట్ సీట్ ఎప్పుడూ ఉత్తరం లేదా దక్షిణం వైపు చూస్తున్నట్లు ఉండాలి.
తూర్పు లేదా పశ్చిమం వైపు ముఖం పెట్టి కూర్చోకూడదు.
నీటి కుళాయిలు, షవర్ బాత్రూమ్ లోపల తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్యం గోడలకు ఉండాలి.
అద్దాన్ని ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరం గోడకు తగిలించాలి.
బాత్రూమ్ గాలి బయటకు వెళ్లడానికి కిటికీ లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్ వాయువ్యం లేదా పశ్చిమం వైపు ఉండాలి.

వంటగదికి ఎదురుగా గానీ, పక్కన ఆనుకుని గానీ బాత్రూమ్ ఉండకూడదు.
పూజగదికి పైన, కింద లేదా ఆనుకుని బాత్రూమ్ అస్సలు ఉండకూడదు.
బాత్రూమ్ తలుపులు ఎప్పుడూ వేసి ఉంచాలి.
లోపల ఎప్పుడూ శుభ్రంగా, సువాసనతో ఉండేలా చూసుకోవాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+