ఇంట్లో వాస్తు దోషాలున్నాయని ఎలా తెలుస్తుంది?
ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయో? లేదో? తెలుసుకోవడానికి కొన్ని స్పష్టమైన సంకేతాలు, లక్షణాలు మనకు కనపడతాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. మీ ఇంట్లో సానుకూల శక్తి తగ్గడం, ప్రతికూల శక్తి పెరగడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నప్పుడు ఈ కింద పేర్కొన్న విధంగా కొన్ని పరిస్థితులను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు వాస్తు నిపుణులను సంప్రదించి వారి సూచనలు, సలహాల మేరకు మార్పుచేర్పులు చేసుకుంటే ప్రశాంతంగా జీవించగలుగుతారు.
ఇంట్లోకి రాగానే అసహనంగా ఉంటుంది.
మనసు చాలా భారం అనిపిస్తుంది. అసౌకర్యం కలుగుతుంది.
కుటుంబ సభ్యులంతా అనారోగ్యానికి గురవుతంటారు.
ఒకేసారి కాకుండా ఒకరి తర్వాత ఒకరుగా ఇది జరుగుతుంది.
కారణమేదీ లేకుండానే భార్యాభర్తలిద్దరూ గొడవపడతారు.
నిద్రించే వేళలో భయం కలిగించే కలలు వస్తాయి.
ఎప్పుడూ కోపం, చికాకు, ఒత్తిడితో ఉంటారు.
నైరుతి దిక్కు, ఈశాన్య దిక్కుల్లో దోషం ఉండటంవల్ల ఇలా జరుగుతుంది.

ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవదు.
ఇంట్లో గడియారాలు ఆగిపోతుంటాయి.
వ్యాపారంలో నష్టాలు వస్తాయి.
చేసే పనులన్నీ చివరి నిముషంలో ఆగిపోతాయి.
ఉద్యోగంలో అనేక చికాకులు కలుగుతుంటాయి.
ఆగ్నేయంలో నీరు, ఉత్తరంలో భారీ వస్తువులు ఉండటంవల్ల ఇలా జరుగుతుంది.
ఇంటి గోడలపై పగుళ్లు రావడం, పైకప్పు నుండి నీరు లీక్ అవ్వడం
గోడలు తేమగా ఉండటం వాస్తు ప్రకారం మంచిది కాదు.
ఈశాన్య మూల ఎప్పుడూ శుభ్రంగా, వెలుతురుతో ఉండాలి.
అక్కడ చెత్తాచెదారం లేదా బరువైన వస్తువులు ఉంటే ఇంట్లో పురోగతి ఆగిపోతుంది.
ఇంట్లోకి సహజమైన గాలి, వెలుతురు రాకపోవడం వల్ల కూడా ప్రతికూల శక్తి పెరుగుతుంది.
ఇంటి ఆవరణలో ఉన్న మొక్కలు నీరు పోసినా ఎండిపోతుంటాయి.
లేదా వింతైన వాసనలు రావడం వంటివి జరుగుతాయి.
ఇలా జరిగితే ఆ ఇంట్లో సానుకూల శక్తి లేదని అర్థం.
ఇంట్లో 'ఉప్పు నీటితో' గదులను శుభ్రం చేయడం,
సాయంత్రం వేళల్లో కర్పూరం వెలిగించడం
ఈశాన్యంలో నీటి కుండను ఉంచడం వంటి
చిన్న చిన్న మార్పులతో సానుకూల శక్తిని ఇంట్లోకి ఆహ్వానించవచ్చు.. ఉన్నదాన్ని పెంచుకోవచ్చు.
-
మఖా నక్షత్రంలోకి కేతువు సంచారం.. మకరరాశితో సహా ఆ రాశులవారికి పండుగే! -
నవ పంచమ రాజయోగంతో ఏప్రిల్ లో వీరికి జాక్ పాట్.. తగ్గేదే లేదు! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
100ఏళ్ల తర్వాత శని మంగళ యుతి.. ఏప్రిల్ లో ఈ రాశులకు డబ్బే డబ్బు! -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఖాళీ స్థలం ఉంది కదా అని గది కడుతున్నారా? కానీ వాస్తు ఏం చెబుతోందో తెలుసా? -
జన్మ నక్షత్రం రోహిణి, మృగశిర, ఆరుద్ర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం ఇంట్లో డస్ట్‌బిన్ ఎక్కడ పెడుతున్నారు? -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications