వాస్తు ప్రకారం చేతిలో డబ్బు నిలవాలంటే వీటిని ఫాలో అవుతున్నారేమో చూసుకోండి
కొందరు ఎంత కష్టపడుతున్నా వారికి చేతిలో డబ్బు నిలవదు. ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకా అని ఆలోచిస్తుంటారు. వాస్తు దోషాలేమైనా ఉన్నాయోమో అని నిపుణులను సంప్రదిస్తుంటారు. ఇంటిని చూపిస్తుంటారు. ఆర్థికంగా చేతిలో డబ్బు నిలవడానికి, ఇబ్బందులు ఎదురవకుండా ఉండటానికి, ధనప్రవాహాన్ని అడ్డుకోకుండా ఉండటానికి చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయి. వాటిని అనుసరిస్తే సమస్యలన్నీ తీరిపోతాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. వాటిగురించి తెలుసుకుందాం.
డబ్బు, ఆభరణాలు బీరువాలో ఉండాలి.
అది దక్షిణం వైపు గోడకు ఆనించి ఉండాలి.
బీరువాపై బరువైన వస్తువులు ఉండకూడదు.
చీకటి గదుల్లో డబ్బును అసలు దాచకూడదు.

ఇతర దుస్తులు ధరించొద్దు.
ఆభరణాలు పంచుకోవద్దు.
పనిచేయని అన్ని వస్తువులను బయట పారేయాలి.
అల్మారాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
ఇంటి మూలలు క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి.
మాస్టర్ బెడ్ రూం నైరుతి దిశలో ఉండాలి.
మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదు.
దీనివల్ల అనారోగ్యం కలుగుతుంది.
సంపాదించిన డబ్బంతా చికిత్సకే అయిపోతుంది.
ఎలక్ట్రానిక్ వస్తువులు బెడ్ రూంలో ఉంటే మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది.
వాటిని దూరంగా ఉంచండి.
వంటగది అన్నపూర్ణకు ఆవాసం.
మరమ్మతులు, లీకేజీలు, పనికిరాని వస్తువులుంటే వెంటనే తొలగించాలి.
ఇంటి ప్రధాన ద్వారం శుభ్రంగా ఉండాలి.
అక్కడ చిందర వందరగా చెప్పులు విడవకూడదు.
ప్రతిరోజూ అక్కడ ఊడ్చి ముగ్గు వేయాలి.
ద్వారానికి ఎదురుగా తులసికోట ఉండాలి.












Click it and Unblock the Notifications