ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
మనిషి సుఖంగాను, సౌకర్యవంతంగానూ జీవించాలి అంటే డబ్బు ఎంతో అవసరం. డబ్బు లేకపోతే జీవితం గడవదు. డబ్బు లేకపోతే ఎక్కడా ఏ పని జరగదు. డబ్బుకు మానవ జీవితంలో అంతటి ప్రాధాన్యత ఉంది. డబ్బే జీవితం కాకూడదు కానీ, జీవితంలో డబ్బు అవసరం తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి దానిని సంపాదించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది.
కుబేరుడు ప్రసన్నం అయితే మీరు కోటీశ్వరులవుతారు
నిజ జీవితంలో మన ఏ అవసరాలు తీరాలన్నా డబ్బే కీలకభూమిక పోషిస్తుంది. ఇక అటువంటి డబ్బు ఆటోమేటిక్ గా రావాలి అంటే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఒక వస్తువును పెట్టుకుంటే తప్పనిసరిగా వస్తుందని చెబుతున్నారు. వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని ఉపాయాలు అనుసరించడం ఎప్పుడూ మంచి ఫలితాలను ఇస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం సంపదకు, శ్రేయస్సుకు అధిపతి కుబేరుడు. అటువంటి కుబేరుడు ప్రసన్నం అయితే మీరు ఖచ్చితంగా కోటీశ్వరులవుతారు.

ధనలక్ష్మి తాండవించటానికి ఇలా చెయ్యండి
కుబేరుని ప్రసన్నం చేసుకోవడానికి ఇంట్లో ఎప్పుడూ ధనలక్ష్మి తాండవించటానికి ఇంట్లో కుబేర యంత్రం పెడితే మంచిదని, ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే, నియమాలను అనుసరించి కుబేర యంత్రాన్ని పూజిస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. వాస్తు ప్రకారం కుబేర యంత్రం ఇంట్లో ఉండడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. సరైన దిశలో దీనిని పెట్టి, సరైన రీతిలో కుబేర యంత్రాన్ని పూజిస్తే డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు.
కుబేర యంత్రాన్ని ఈ దిశలో పెట్టి పూజించాలి
కుబేర యంత్రాన్ని వాస్తు ప్రకారం ఇంటికి తూర్పున లేదా ఉత్తరం వైపున ఉంచాలి. దీనిని తాకకుండా జాగ్రత్తపడాలి. కుబేర యంత్రాన్ని తప్పనిసరిగా నియమానుసారంగా శుభ్రం చేయాలి. స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి, వేరే యంత్రాన్ని పాలతో కానీ రోజ్ వాటర్ తో కానీ శుభ్రం చేసి, స్వచ్ఛమైన మనసుతో తాజా పూలు, పండ్లు, అగర్బత్తీలు వెలిగించి కుబేరుని పూజించాలి.
ఇలా చేస్తే ఆర్ధికంగా కలిసి వస్తుంది
ఓం హ్రీం శ్రీం హ్రీం కుబేరాయ నమః అంటూ 108 సార్లు కుబేర శ్లోకాన్ని జపించాలి. కుబేర యంత్రాన్ని ఇంట్లో పెట్టి ఈ పని చేస్తే కుబేరుడు దయ తప్పకుండా ఉంటుంది. ఆర్థికపరమైన ఏ పనులు చేసిన మీకు కలిసి వస్తుంది. మీ ఇంటికి ఆటోమేటిక్ గా డబ్బు వచ్చి పడుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications