Vastu tips: ఇంట్లో ఈ సింపుల్, పాజిటివ్ వస్తువులు పెట్టుకోండి.. ధనవర్షం కురుస్తుంది నమ్మండి!!
వాస్తు నిపుణులు సూచించే కొన్ని సింపుల్ మరియు పాజిటివ్ వస్తువులను ఇంట్లో ఉంచటం వల్ల మీరు ధనవంతులు అవుతారని, ఇంట్లో ధన వర్షం కురుస్తుందని అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.
ఇల్లు సంతోషంగా ఉండాలని ఎవరి కోరుకోరు? ప్రతి ఒక్కరు తమ ఇల్లు సంతోషంగా ఉండాలని, కుటుంబ సభ్యులందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా, అనారోగ్య సమస్యలు లేకుండా బతకాలని ఆశిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు కట్టుకొని, వాస్తు దోషాలు లేకుండా ఇల్లు నిర్వహించుకున్నప్పుడు కచ్చితంగా ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు సుఖశాంతులతో ప్రశాంతంగా జీవించడానికి, లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి అవకాశం ఉంటుంది. వాస్తు దోషాలు ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడు ప్రతికూలతలు పెరుగుతూ ఉంటాయి. పేదరికం వచ్చి పడుతుంది. అయితే ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచుకోవడం వల్ల అటువంటి వాస్తు దోషాలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇంతకీ ఆ వస్తువులు ఏంటి? వాటిని ఇంట్లో పెట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి? అంటే...

వీటిని పెట్టుకోవడం వల్ల శ్రేయస్సు, ఐశ్వర్యం
హిందూ శాస్త్రాలు, వాస్తు ప్రకారం మనం ఇంట్లో పెట్టుకోవలసిన వస్తువులలో ఏనుగు చాలా పవిత్రమైనది. ఏనుగు బొమ్మలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో వారికి శ్రేయస్సు, ఐశ్వర్యం రెండు కలుగుతాయి . హిందూమతంలో ఏనుగును దేవతల సమానంగా పూజిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇత్తడి లేదా వెండి లోహంతో చేసిన ఏనుగును ఇంట్లో ఉంచుకుంటే ఎప్పుడు సానుకూలత, శ్రేయస్సు ఆ కుటుంబ సభ్యులకు ఉంటుంది. ఇక ఇంట్లో తాబేలు బొమ్మలు కూడా పెట్టుకోవడం మంచి చేస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. లక్ష్మీదేవి స్వయంగా తాబేలులో నివసిస్తుందని, మహావిష్ణువు సముద్రం సమయంలో తాబేలు రూపాన్ని తీసుకున్నారని చెబుతారు. కాబట్టి అటువంటి తాబేలు బొమ్మలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో సానుకూలత వ్యాపిస్తుంది.

ఇంట్లో డబ్బు వర్షం కురవాలంటే ఈ పని చేయండి
ఇంట్లో మహాలక్ష్మి ఫోటోను లేదా విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల సంపద పెరుగుతుంది. కుటుంబ సభ్యులు ఎప్పుడూ సంతోషంగా ఉండడానికి ఇది కారణమవుతుంది. శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని ప్రతిరోజు ఇంట్లో పూజించేవారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. వారి ఇళ్లలో సంపద వర్షం కురుస్తుంది. శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని మాత్రమే కాకుండా ఇంట్లో కుబేరుడి ఫోటో పెట్టి పూజలు చేయడం వల్ల కూడా సంపద పెరుగుతుంది. ఇతర సమస్యల నుంచి బయట పడడానికి అవకాశం ఉంటుంది.

ఇంట్లో ఆనందం శ్రేయస్సు కోసం ఇదే
ఇంట్లో లాఫింగ్ బుద్ధ బొమ్మను పెట్టుకోవడం వల్ల ధనానికి, ధాన్యానికి లోటు లేకుండా ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. వాస్తు మరియు ఫెంగ్ షుయ్ లో లాఫింగ్ బుద్ధ చాలా పవిత్రమైనదిగా చెప్పబడుతుంది. లాఫింగ్ బుద్ధాని ఇంటికి ఈశాన్య దిశలో పెట్టుకుంటే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పబడింది. లాఫింగ్ బుద్ధ ఉన్న ఇళ్ళు ఆనందాన్ని, శ్రేయస్సును కలిగి ఉంటాయని చెబుతున్నారు.

కుటుంబ సభ్యులు సంతోషంగా జీవించడానికి ఇది ఉంటే మేలు
ఇంట్లో వాస్తు దోషాన్ని తొలగించడానికి, కుటుంబ సభ్యులందరూ సంతోషంగా జీవించడానికి ఇంట్లో పెట్టుకోవాల్సిన వస్తువులలో మరొకటి శంఖం. శంఖాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. శంఖం ఇంట్లోని వాస్తు దోషాలను తొలగించడంలో ఎంతగానో పనిచేస్తుంది. నిత్యం శంఖు పూజలు చేసి, శంఖాన్ని ఊదే ఇళ్లలో పాజిటివ్ వైబ్స్ ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శంఖం శ్రీమహావిష్ణువుకు, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనదని చెప్పబడింది. శంఖం ఇంట్లో ఉంచడం వల్ల డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుందని చెబుతారు.

ఇంట్లో ఆర్థిక సమస్యల నుంచి బయట పడాలంటే ఈ వస్తువు పెట్టుకోండి
ఇక ఇంట్లో ఉంచుకోవలసిన మరొక వస్తువులో వేణువు ఒకటి. వాస్తు దోషాలను తొలగించడంలో వేణువు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతే కాదు శ్రీకృష్ణుడికి వేణువు అంటే ఎంతో ఇష్టం ఉండటం వల్ల హిందూమతంలో వేణువును శుభానికి, శ్రేయస్సుకు సంకేతంగా భావిస్తారు. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉంటే దాని నుంచి బయటపడడానికి, ఆ ఇంట్లో వేణువును తెచ్చి పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఇంట్లో వేణువును పెట్టుకునేవారు ఇంటికి తూర్పు మరియు ఉత్తర దిశలోనే వేణువును ఉంచాలని చెబుతున్నారు. ఇంట్లో వేణువుని ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిరంగా నివసిస్తుందని చాలామంది బలంగా నమ్ముతారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు!












Click it and Unblock the Notifications