vastu tips: గురువారం ఈ వస్తువులను మీ బీరువాలో పెట్టండి.. ధనలక్ష్మి నడిచొస్తుంది చూడండి!!
హిందూ మతంలో ప్రతిరోజు ఒక ప్రత్యేకత ఉంటుంది. హిందూమతంలో సోమవారాన్ని శివుడికి, మంగళవారాన్ని ఆంజనేయ స్వామికి, బుధవారాన్ని సుబ్రహ్మణ్యస్వామికి, గురువారాన్ని శ్రీమహావిష్ణువుకు, శుక్రవారం లక్ష్మీదేవికి, శనివారం వెంకటేశ్వర స్వామికి అంకితం చేశారు. అయితే గురువారం నాడు శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించడం ద్వారా బృహస్పతి వారి జీవితంలో బలంగా ఉంటారని హిందువులు విశ్వసిస్తారు.
గురువారానికి అధిపతి బృహస్పతి. ఎవరి జాతకంలో అయితే బృహస్పతి బలంగా ఉంటాడో వారు అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవిస్తారని బలంగా నమ్ముతారు. ఇక గురువారం రోజు కొన్ని వాస్తు నియమాలను పాటిస్తే, ముఖ్యంగా బీరువా, డబ్బులను భద్రంగా పెట్టే లాకర్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ధనలక్ష్మి ఇంటికి నడిచొస్తుందని చెబుతారు. ఇక వాటి విషయానికి వెళితే గురువారం కొన్ని వస్తువులను బీరువాలో పెట్టడం వల్ల మంచి జరుగుతుందని, ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతున్నారు.

సహజంగా గురువారం నాడు ఎవరైనా శ్రీమహావిష్ణువుకి కానీ, సాయిబాబా కి కానీ పూజ చేస్తారు. అయితే గురువారం నాడు శివుడిని పూజించిన మంచి ఫలితం ఉంటుందంటున్నారు. ఓ కొబ్బరికాయను తీసుకుని గురువారం నాడు శివాలయానికి వెళ్లి, కొబ్బరికాయను శివలింగానికి తాకించి మనసులో ఉన్న కోరికను చెప్పి, శివపార్వతులను పూజించి, ఆపై ఆ కొబ్బరికాయను ఇంటికి తీసుకువచ్చి బీరువాలో భద్రంగా పెట్టాలని అలా చేస్తే ఐశ్వర్యం వస్తుందని చెబుతున్నారు. ఏవైనా ప్రత్యేక సందర్భాలలో ఆ కొబ్బరికాయను తీసి పూజలు నిర్వహించుకోవచ్చు అని సూచిస్తున్నారు.
అంతేకాదు గురువారం నాడు ఎవరైతే శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని తులసీదళాలతో, పసుపు రంగు పుష్పాలతో పూజిస్తారో.. వారు పూజ పూర్తయిన తర్వాత తులసీదళాన్ని, పుష్పాన్ని బీరువాలో పెట్టడం వల్ల అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతున్నారు. గురువారం రోజు బీరువాలో దేవుడి పూజకు ఉపయోగించిన ఎర్రటి వస్త్రాన్ని పెట్టినా మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఐశ్వర్యం వచ్చి పడుతుందని, డబ్బుకు లోటు లేకుండా ఉంటుందని చెబుతున్నారు.
అంతేకాదు గురువారం నాడు శ్రీమహావిష్ణువును పూజించేటప్పుడు స్వామికి ఇష్టమైన తమలపాకులను పెట్టి, ఆపై ఆ తమలపాకు పై చందనం, తిలకం పూసి, తమలపాకును జాగ్రత్తగా బీరువాలో పెట్టినా కలిసి వస్తుందని చెబుతున్నారు. ఈ చిన్న చిన్న చిట్కాలతో జాతకంలో బృహస్పతి బలంగా మారతారని, ఫలితంగా ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతున్నారు.
Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications