Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

vastu tips: ఆ దిశలో మెట్లు ఉంటే కుటుంబంలో ఆర్ధిక ఇబ్బందులు, అనారోగ్యాలు!!

ఇంటిని వాస్తు నియమాలను అనుసరించి ఏ విధంగా అయితే నిర్మించుకోవాలో అలాగే ఇంట్లో పెట్టుకునే వస్తువులను కూడా వాస్తు నియమాలను అనుసరించి పెట్టుకోవాలి అన్న విషయం తెలిసిందే. అంతే కాదు ఇంట్లో మెట్ల నిర్మాణం కూడా సరైన దిశలో చేసుకోవాలి. సరైన దిశలో మెట్ల నిర్మాణం చేసుకోకపోతే కచ్చితంగా ఆర్ధిక ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు.

మెట్లే కదా అని ఏ దిక్కున పడితే ఆ దిక్కులో కడితే ఇబ్బంది తప్పదని హెచ్చరిస్తున్నారు. మెట్ల నిర్మాణం చేసేటప్పుడు కచ్చితంగా వాస్తు నియమాలను పరిగణనలోకి తీసుకోవా.లి వాస్తు శాస్త్రం మెట్ల కోసం కొన్ని నియమాలను నిర్దేశిస్తుంది. వీటిని అనుసరించి మెట్ల నిర్మాణం చేసుకుంటే కుటుంబంలో సంతోషం, శ్రేయస్సు వెల్లివిరుస్తుంది.

vastu tips: Stairs in that direction.. Financial difficulties and illnesses will increase in the family!

సరైన దిశలో మెట్ల నిర్మాణం చేపడితే జీవితం మెరుగుపడుతుంది. వాస్తు శాస్త్రంలో నైరుతి దిశలో మెట్ల నిర్మాణం చేయడం ఉత్తమమని చెప్పబడింది. ఈ దశలో మెట్లు ఉంటే ఇల్లు సంతోషంతో , శ్రేయస్సు తో ఉంటుంది. పురోగతికి మార్గం సుగమమవుతుంది. పొరపాటున కూడా వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిశలో మెట్ల నిర్మాణం చేయకూడదు.

ఈశాన్య దిశలో మెట్లు నిర్మించడం కచ్చితంగా తప్పని చెప్పొచ్చు. ఈశాన్యంలో మెట్లు ఉంటే ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ, వ్యాపార సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇంటి ఆగ్నేయంలో మెట్లు నిర్మించడం కూడా వాస్తు ప్రకారం మంచిది కాదు ఇంటికి ఆగ్నేయ దిశలో మెట్లు ఉంటే పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి.మెట్లు అన్ని ఒకే విధంగా ఉండాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ పరిమాణం ఉండకూడదు.

ఒకవేళ అలా పరిమాణంలో తేడాగా ఉన్న మెట్లు ఉంటే కూడా ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. వాస్తు ప్రకారం మెట్ల సంఖ్య ఎప్పుడు బేసి సంఖ్య గా ఉండాలి. సరి సంఖ్యలో మెట్లు ఉంటే అవి దురదృష్టాన్ని తీసుకువస్తాయి. మెట్లు ఎల్లప్పుడు వెడల్పుగా ఉండాలి. ఇరుకైన మెట్లు అభివృద్ధికి ఆటంకాన్ని కలిగిస్తాయి. మెట్ల దిగువన ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+