ఇంట్లో ఖర్చులు తగ్గి సంపద పెరగడానికి వాస్తు చిట్కాలు
ఇంటికి వాస్తు ఎంత బాగున్నప్పటికీ కొన్ని కొన్ని సార్లు ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఖర్చులు పెరుగుతుంటాయి. ఎంత ప్రయత్నించినా వీటిని తప్పించుకోలేరు. అయితే అందుకు కొన్ని చిన్న చిట్కాలున్నాయి. వాటిని అనుసరిస్తే డబ్బును పొదుపు చేయగలరు.. ఖర్చును తగ్గించుకోగలరు. అందుకు కొన్నింటిని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాటిని తెలుసుకుందాం.
ఇంట్లో గోడపై మెటల్ వస్తువులను వేలాడదీయాలి.
బెడ్ రూం ముందు గోడకు ఎడమ వైపు ఇవి ఉండాలి.
ఈ ప్రదేశం అదృష్టాన్ని తెచ్చే ప్రదేశం.
ఆవైపు గోడ సరిగా లేకపోతే సరిచేయాలి.

ఇంట్లో పాత వస్తువులుంటే ఖర్చులు పెరుగుతాయి.
కొందరు వాటిని మెట్ల కింద పెడతారు.
అలా పెట్టినా నష్టాలు తప్పవు.
విరిగిన పాత్రలు, దెబ్బతిన్న వస్తువులు కూడా ఉండొద్దు.
డబ్బులు ఉంచే బీరువా కానీ, అల్మారా కానీ తూర్పు ముఖంగా ఉండాలి.
ఉత్తరంవైపు ఉంటే ఇంకా మంచిది.
ఇంటి నీటి ప్రవాహం దక్షిణం నుంచి పడమర వైపు వెళ్లకూడదు.
అలా ఉంటే నష్టాలు కలుగుతాయి.
ఉత్తరం కానీ, తూర్పు కానీ ప్రవహించాలి.
ఇంట్లో నీరు లీకవుతుంటే బాగు చేయించాలి.
నీరు అలా లీకవుతుంటే ఖర్చులు పెరుగుతాయి.
ఈశాన్య మూలలో బరువు ఉండకూడదు.
వారానికోసారి ఇంటిని ఉప్పు నీటితో శుభ్రం చేయాలి.












Click it and Unblock the Notifications