Vastu tips: రోడ్డుపై పడేసిన వీటిని తొక్కుతున్నారా? అయితే ఏం జరుగుతుందంటే!!
రోడ్లపై చాలామంది దిష్టి తీసి చాలా వస్తువులు పడేస్తూ ఉంటారు. నిమ్మకాయలు, కోడిగుడ్లు, మిరపకాయలు.. ఇలా రకరకాల దిష్టి సామాన్లను పడేస్తూ ఉంటారు. అయితే రోడ్డుపైన పడి ఉన్న వాటిని తొక్కినా ఏమీ కాదని హేతువాదులు చెప్తుంటే, కొందరు దిష్టి తీసిన వాటిని తొక్కకూడదు అని చెప్తున్నారు.
చాలా మంది రోడ్డుపై ఏవైనా పడి ఉంటే తొక్కుకుంటూ వెళ్తారు. కొందరు వాటిని దాటుకుంటూ వెళ్తారు. కొందరు అలాంటివి చూస్తేనే వాటికి దూరంగా ఉంటారు. సహజంగా దృష్టి నుండి తగిలే దోషం ఉంటుందని చెప్తారు జ్యోతిష్య పండితులు. అలా దృష్టి దోషం ఉన్నప్పుడు అది పోవటం కోసం ఉప్పు తిప్పి వేయటం, నిమ్మకాయలు తిప్పి వేయటం, మిరపకాయలు తిప్పి వేయటం వంటివి చేస్తుంటారు.

వాటిని చాలా మంది రోడ్ల మీద పడేస్తూ ఉంటారు. ఇక వాటిని తొక్కితే ప్రతికూల ఫలితాలు కలుగుతాయని, నెగటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు . వాస్తవంగా చెప్పాలంటే రోడ్డుపై పడేసిన దేనిని ముట్టుకోకూడదు. రోడ్డుపై పడి ఉన్న వెంట్రుకలను ఎప్పుడు దాటి వెళ్ళకూడదు.వాటిని తాక కూడదు. రోడ్డు మీద వెంట్రుకలను దాటి వెళితే అది జీవితంలో సమస్యలను కలిగిస్తుంది.
రోడ్డుపై పడి ఉన్న నిమ్మకాయలు, మిరపకాయలను చూస్తే వాటిని తొక్కకుండా ఉంటేనే మంచిది. ఇక వాటిని తొక్కినా ప్రతికూల ఫలితాలు కలుగుతాయని కొందరు బలంగా విశ్వసిస్తారు. పూజా సామాగ్రి కానీ ఆహారం కానీ రోడ్డు పక్కన లేదా చెట్టు కింద పడి ఉంటే దానిని కూడా తాకకూడదని చెబుతున్నారు.
ఇప్పుడు బూడిద లేదా కాలిన కలపను ఎక్కడైనా ఉంచినట్లయితే దాటి వెళ్ళకూడదని చెబుతున్నారు. ఎక్కడైనా రోడ్డుపై చనిపోయిన జంతువు కనిపిస్తే దాన్ని చూసిన వెంటనే దిశ మార్చుకొని వెళ్లాలని సూచిస్తున్నారు. అయితే దిష్టి తీసి పడేసిన గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయ తొక్కినా అనుమానం పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు.
గుమ్మడి కాయ, కొబ్బరికాయ, నిమ్మకాయ మూడు ప్రతికూలతను బయటకు రానివ్వకుండా వాటిలోనే ఉంచుకుంటాయి అని, బయటకు మంచిని మాత్రమే పంపుతాయని చెబుతున్నారు. అసలు రోడ్లపై ఉన్న వస్తువులను తొక్కకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ పొరపాటున తొక్కితే దానికి భయపడాల్సిన అవసరం లేదు.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications