vastu tips: ఇంట్లో గడియారం ఉంచేందుకు వాస్తు.. తప్పుదిశలో పెడితే తిప్పలు తప్పవు!!
గడియారాలను సమయాన్ని తెలుసుకోవడానికి మాత్రమే కాకుండా ఇంటి అలంకరణ కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటాము. అందంగా కనిపించే గడియారం గది అందాన్ని పెంచటం కోసమే కాకుండా ఇంట్లో వాస్తు నియమాలను దృష్టిలో పెట్టుకొని కూడా పెట్టుకోవాలి. వాస్తుని దృష్టిలో పెట్టుకోకుండా గడియారాలను ఏర్పాటు చేసుకుంటే అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.
వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంట్లో గడియారం సరైన దిశలో పెట్టకపోతే ఆ కుటుంబం అనేక కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది.గోడ పై గడియారాన్ని ఉంచడానికి ఉత్తమమైన దిశా ఈశాన్య దిశ. డ్రాయింగ్ రూమ్, బెడ్ రూమ్ లేదా పూజ గది ఏ గదిలో ఉంచినప్పటికీ ఈశాన్య దిశలోనే గడియారాన్ని పెట్టడం మంచిది.

ఈశాన్యంలో గడియారాన్ని పెట్టడానికి స్థానం లేకపోతే రెండవ ప్రాధాన్యత ఉత్తర దిశ. ఉత్తర దిశలో కూడా పెట్టడానికి స్థానం లేకపోతే మూడవ ప్రాధాన్యత తూర్పు దిశ. ఈ దిశల్లో పెడితేనే గడియారం ప్రతికూల ఫలితాలను ఇవ్వదు. అంతేకాదు సరైన దిశలో గడియారం పెట్టడం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. అందుకే గడియారం పెట్టుకునే విధానంలో కొన్ని ముఖ్యమైన వాస్తు నియమాలను కచ్చితంగా పాటించాలి.
గడియారం పెట్టుకున్నప్పుడు గడియారం నడుస్తుంది అనే విషయాన్ని కచ్చితంగా నిర్ధారించుకోవాలి. ఈశాన్య దిశలో గడియారం పెట్టుకుంటే గౌరవం, కీర్తి, శ్రేయస్సు లభిస్తాయి. ఉత్తర దిశలో గడియారాన్ని పెట్టడం వల్ల సంపద లభిస్తుంది. ఇది వృత్తిలో అడ్డంకులను తొలగిస్తుంది. ఏదైనా కారణం చేత ప్రమోషన్ ఆగిపోయినా లేదా ఉద్యోగం ఆగిపోయినా, వ్యాపార లావాదేవీలు ఆగిపోయినా ఉత్తర దిశలో గడియారం పెట్టడం వల్ల ఆ ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి.
తూర్పు దిశలో గడియారాన్ని పెడితే కుటుంబ సభ్యులకు సంతోషం ఉంటుంది. అయితే నైరుతి మరియు దక్షిణ గోడలపై గడియారాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు ఇంటి తలుపు ఫ్రేమ్ పై కూడా గోడ గడియారాన్ని పొరపాటున కూడా ఉంచకూడదు. డోర్ ఫ్రేమ్ పై గోడ గడియారం పెట్టడం వల్ల ఆ ఇంట్లోని వారు బయటకు వెళ్ళే సమయం ఆసన్నమైందని అర్థం అంటున్నారు. ఇంట్లో దుర్వార్త వినాల్సి వస్తుందని చెబుతున్నారు. కనుక గడియారాన్ని పెట్టుకునేటప్పుడు కచ్చితంగా దిశల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
వాస్తు ప్రకారం సంపద కోసం ఇంట్లో పెంచాల్సిన 5 మొక్కలు ఇవే! -
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే! -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications