Vastu tips: పిల్లలు చదువులో రాణించటం లేదా? అయితే ఈ వాస్తుచిట్కాలు మీ కోసమే!!

చాలా మంది విద్యార్థులు ఎంత చదివినా చదివింది వంట పట్టడం లేదని బాధపడుతూ ఉంటారు. తల్లిదండ్రులు ఎంత కష్టపడినా పిల్లలు మాత్రం చదువులో రాణించలేకపోతారు. విద్యార్థులు సైతం బోలెడంత ఎఫర్ట్ పెట్టినా ఫలితం లేకుండా పోతుంది. అయితే అటువంటప్పుడు ఇంట్లో వాస్తు దోషాలు ఏమైనా ఉన్నాయేమో కచ్చితంగా పరిశీలించుకోవాలి. వాస్తు దోషాలు ఉంటేనే పిల్లలు చదువులో రాణించలేరు అన్న విషయాన్ని గుర్తించాలి.

విద్యార్థులు విద్యలో బాగా రాణించాలంటే వాస్తు నియమాలను పాటించాలి. స్టడీ రూమ్ మీ ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు స్టడీ రూమ్ లో ని స్టడీ టేబుల్ తూర్పు లేదా ఉత్తర దిశలో ఉండేలా చూసుకోవాలి. మనకు ఎదురుగా ఖాళీ గోడ ఉంటే అది ఏకాగ్రతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది అని చాలామంది భావిస్తారు.

 Vastu tips

ఖాళీ గోడ కంటే విద్యార్థులకు ప్రేరణ కలిగించే పోస్టర్లను అక్కడ ఏర్పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. విద్యార్థులు చదువుకునే గది లోపల గాలి, వెలుతురు బాగా వచ్చేలా ఉండాలని, స్టడీ టేబుల్ కి ఆగ్నేయం వైపున లైట్ పెట్టాలని చెబుతున్నారు. స్టడీ టేబుల్ కోసం విభిన్న ఆకృతులు వున్న టేబుల్స్ ను ఉపయోగించకూడదని చెబుతున్నారు.

చదరంగా, దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న టేబుల్స్ ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు విద్యార్థులు చదువుకునే గదులకు తేలికపాటి ప్రశాంతంగా ఉండే రంగులను వేయాలని, కిటికీ ఎదురుగా టేబుల్ ఉండకుండా చూసుకోవాలని చెబుతున్నారు.స్టడీ టేబుల్, స్టడీ రూమ్ ఎప్పుడూ చిందరవందరగా ఉంచకూడదని, ఎప్పుడూ నీట్ గా సర్దుకుని ఉంటేనే మంచిదని చెబుతున్నారు.

స్టడీ టేబుల్ డెస్క్ పై ప్రత్యక్ష సూర్యకిరణాలు పడకూడదని, అలా ఉంటే చదవడానికి ఇబ్బందిగా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు స్టడీ టేబుల్ కి వాల్ కి మధ్య కాస్త గ్యాప్ చూసుకోవాలని, గోడకి ఆనించి స్టడీ టేబుల్ వేసుకోకూడదని చెబుతున్నారు. స్టడీ రూమ్ కి తలుపు ఈశాన్యం లేదా ఉత్తర దిశలో, తూర్పు లేదా పడమర దిశలో ఉంటే ఆ విద్యార్థులకు చదువు బాగానే వంటబడుతుందని అంటున్నారు.

స్టడీ రూమ్ లో పిరమిడ్ ను ఉంచితే, అది శక్తిని సమతుల్యం చేయడానికి, దృష్టిని పెంచడానికి సహాయపడుతుంది అని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే విద్యార్థుల విద్యా విషయాలలో ఈ వాస్తు నియమాలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+