ఇంటికి వాస్తు దోషం, నర దోషం పోవాలంటే ఏం చేయాలి?

ఇంట్లోకి కేవలం సంతోషం మాత్రమే ప్రవేశించాలి అంటే, వాస్తు నిపుణులు సూచిస్తున్న "పాజిటివ్ ఎనర్జీ బూస్టర్స్" కచ్చితంగా పాటించాల్సిందే. ఎందుకంటే వాటిని పాటించడంవల్ల ఇంటికి వాస్తు దోషం పోవడమే కాదు.. దృష్టి దోషం కూడా పోతుంది. నిపుణులు ఏం చెప్పారో తెలుసుకొని వాటన్నింటినీ అందరూ పాటించి సంతోషంగా ఉండండి.

సింహద్వారమే.. అదృష్ట ద్వారం!

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం కేవలం
మనుషులు వచ్చే దారి మాత్రమే కాదు,
అది సానుకూల శక్తి ప్రవహించే మార్గం.
మీ ఇంటి గుమ్మాన్ని అత్యంత శుభ్రంగా ఉంచుకోండి.
గుమ్మానికి ఇరువైపులా స్వస్తిక్ గుర్తులు వేయండి.
లేదా మామిడి ఆకుల తోరణాలు కట్టడం వల్ల ప్రతికూల శక్తులు ఇంటి బయటే ఆగిపోతాయి.
ప్రధాన ద్వారం వద్ద పాత చెప్పులు, విరిగిన వస్తువులు లేదా చీకటి ఉండకూడదు.
మంచి వెలుతురు, సువాసన వచ్చేలా చూసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినట్లే.

vastu tips What should be done to eliminate defects and the evil eye from a home

దిష్టి తగలకుండా రక్షణ కవచం

మనం ఎంత కష్టపడినా కొన్నిసార్లు ఫలితం దక్కదు.
దానికి కారణం 'చెడు దృష్టి'.
కాలం మారుతున్నా నిమ్మకాయ-పచ్చిమిర్చిని
ప్రధాన ద్వారాన్ని వేలాడదీసే సంప్రదాయం వెనుక సైన్స్ కూడా ఉంది.
ఇది బయటి నుంచి వచ్చే ప్రతికూల ప్రకంపనలను అడ్డుకుని,
ఇంటి వాతావరణాన్ని రక్షిస్తుంది.
ఏడాది తొలి రోజే ఈ కొత్త 'రక్షణ కవచాన్ని' ఏర్పాటు చేసుకోండి.

ఉప్పు నీటితో

వాస్తులో ఉప్పుకు నెగెటివిటీని పీల్చుకునే అద్భుత శక్తి ఉంది.
కొత్త సంవత్సరం ప్రారంభంలో మీ ఇంటిని తుడిచే నీటిలో
కొంచెం కల్లుప్పు వేయండి. మూల మూలలా ఈ నీటితో
శుభ్రం చేయడం వల్ల పేరుకుపోయిన
అలసట, మనస్పర్థలు, ఒత్తిడి వంటివి తొలగిపోయి
ఇల్లు ప్రశాంతంగా మారుతుంది.

కర్పూర పరిమళం - సానుకూలతకు సంకేతం

గాలిలోని కలుషితాన్ని మాత్రమే కాదు, మనసులోని కలుషితాన్ని కూడా సువాసనలు తొలగిస్తాయి.
ఉదయం, సాయంత్రం వేళల్లో కర్పూరం హారతి లేదా సాంబ్రాణి ధూపం వేయండి.
దీనివల్ల ఇంటి లోపల ఉండే బ్యాక్టీరియా నశించడమే కాకుండా,
ఇంట్లోని వ్యక్తుల మధ్య బంధాలు బలపడతాయి.

పనికిరాని వస్తువులే.. ప్రగతికి ఆటంకాలు!
చాలామంది విరిగిన కుర్చీలు, పనిచేయని గడియారాలు,
పాత బట్టలను అటక మీద దాస్తుంటారు.
ఇవే మీ ఇంటి వాస్తు దోషానికి ప్రధాన కారణం.
పాతది పోతేనే కొత్తది వస్తుంది. పనికిరాని ఎలక్ట్రానిక్ వస్తువులను,
పగిలిన పాత్రలను ఇంటి నుంచి బయట పడేయండి.
ఇల్లు ఎంత ఖాళీగా, క్రమబద్ధంగా ఉంటే కొత్త ఆలోచనలకు అంత చోటు దక్కుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+