Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2025లో ఈ రాశివారిపై ఏలినాటి శని దెబ్బ గట్టిగానే ఉంటుందన్న వేణు స్వామి

2025 సంవత్సర రాబోతుంది. ఈ సంవత్సరంలో కుంభ రాశి వారి జాతకం ఏ విధంగా ఉంది? అనే విషయాన్ని ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు వేణు స్వామి వెల్లడించారు. 2025 సంవత్సరానికి సంబంధించి ద్వాదశ రాశుల వారి జాతకాలను చెప్పిన వేణు స్వామి కుంభ రాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతుందో వెల్లడించారు.

కుంభరాశి వారిపై ఏలినాటి శని ప్రభావం
ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష 1,2,3,4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలలో పుట్టిన వారు కుంభ రాశి జాతకులు. ఈ సంవత్సరం కుంభ రాశి వారికి ఆదాయం 8 వ్యయం 14, రాజ పూజ్యం 7 ,అవమానం 5. ఈ సంవత్సరం కుంభరాశి జాతకులు ఏలినాటి శని ప్రభావాన్ని చూస్తారు. జన్మశని నుంచి ఏలినాటి శనికి శని మార్పు కారణంగా ఈ సంవత్సరం కుంభరాశి వారి పైన ఏలినాటి శని ప్రభావం ఉంటుంది.

Venu Swamy says that aquarius zodiac sign will face difficulties in 2025 with the elinati shani

ఇంట్లో పెళ్లి కోసం ఎక్కువగా డబ్బులు ఖర్చు
కుంభరాశి జాతకుల తల్లిదండ్రులకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు, కుటుంబంలో సంతానానికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యంగా మగసంతానం ఉంటే వాళ్ళు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడటమే కాదు ఊహించని ప్రమాదాలకు కూడా లోనవుతారు. 2025 సంవత్సరం కుంభరాశి జాతకుల ఇంట్లో పెళ్లి కోసం ఎక్కువగా డబ్బులను ఖర్చు చేస్తారు.

ఈ జాతకులకు ఇబ్బందులు
ఇక విద్యార్థులకు సంబంధించి ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, చెడు సాన్నిహిత్యాల కారణంగా ఇబ్బంది పడతారు. ప్రేమ పేరుతో మోసపోయే అవకాశం ఉంది. విదేశాలలో ఉన్న వారు ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడతారు. కుంభరాశి ఉద్యోగస్తులు ఏసీబీ, సిబిఐ, ఈడి వంటి దర్యాప్తు సంస్థల కేసులలో చిక్కుకుంటారు.

చెడ్డ పేరు వచ్చే ఛాన్స్
ఐఏఎస్, ఐపీఎస్ పొజిషన్లో ఉండేవారికి ఈ సంవత్సరం సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే రాజకీయ రంగంలో ఉండేవారు కూడా సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ద్వారా వ్యతిరేకమైన ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది. సమాజంలో కూడా కుంభరాశి జాతకులు చెడ్డ పేరును తెచ్చుకోవాల్సి వస్తుంది.

మానసికంగా సమస్యలతో ఇబ్బంది
ఇక వ్యవసాయం చేసే రైతులకు మొదటి పంట అంత అనుకూలంగా ఉండదు.రెండో పంటలో మాత్రం రాబడి, దిగుబడి పెరుగుతుంది. అలాగే క్రీడాకారులు సమస్యలను ఎదుర్కొంటారు. అనుకున్న ఫలితాలు రావు. యాంగ్సైటి డిసార్డర్ వంటి సమస్యలతో మానసికంగా సమస్యలతో కుంభ రాశి జాతకులు కృంగిపోతారు.

పరిహారం కోసం ఇలా చెయ్యండి
తిరునల్లార్ లో ఉన్న శనీశ్వరాలయంలో ప్రత్యేకమైన శని పూజలు నిర్వహించుకోవడం ద్వారా, అలాగే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండటం ద్వారా ఈ సంవత్సరం నుంచి అనేక సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది. ఇక ఇదే విషయాన్ని వేణు స్వామి వెల్లడించారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+