త్వరలో వీరికి మహారాజయోగం.. నా మాటే శాసనమన్న శుక్రాచార్యుడు!
సంపదలకు విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు డిసెంబర్ చివరలో కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు . డిసెంబర్ 28వ తేదీన శుక్రుడు కుంభరాశిలో సంచారం చేసి జనవరి 28వ తేదీ వరకు అదే రాశిలో ఉంటాడు. శుక్రుడి కుంభరాశి సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని కొన్ని రాశుల వారికి దురదృష్టాన్ని కలిగిస్తుంది.
కుంభరాశిలో శుక్ర సంచారం
అత్యంత విలాసవంతమైన గ్రహంగా చెప్పుకునే శుక్రుడు జీవితంలో అనుకూలంగా ఉంటే వారి జీవితం సకల సంపదలతో, సంతోషంతో తులతూగుతూ ఉంటుంది. శుక్రుడు ప్రతి నెలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు. ఇలా ప్రతి నెలలో శుక్రుడి రాశి సంచారం కొన్ని రాశుల వారికి కచ్చితంగా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. మరి ప్రస్తుతం కుంభరాశిలో శుక్ర సంచారం కారణంగా లబ్ధి పొందే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

కుంభరాశి
శుక్రుడు కుంభరాశిలో మొదటి గృహంలో సంచరిస్తున్నాడు. ఇది కుంభ రాశి జాతకులకు చాలా శుభ సమయం. ఈ సమయంలో వీరు ఆరోగ్యంగా ఉంటారు. సంతోషంగా జీవిస్తారు. ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. వైవాహిక జీవితంలోని సమస్యలు పరిష్కారం అవుతాయి. నూతన వాహనాలు, నూతన గృహాలు కొనుగోలు చేస్తారు. నూతన ఆదాయ మార్గాలు పెరుగుతాయి. తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది.
మిధున రాశి
మిధున రాశిలో శుక్రుడు తొమ్మిదవ గృహంలో సంచరిస్తాడు. ఇది మిధునరాశి జాతకులకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ సమయంలో మిధున రాశి జాతకులు అన్ని రంగాలలోనూ విజయం సాధిస్తారు. మిధునరాశి వారు ఈ సమయంలో డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంది. పెండింగ్ పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. విదేశాలకు వెళ్లే వారికి ఇది సానుకూల సమయం. ఉన్నతాధికారులు మీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. శత్రువులతో కలిగే సమస్యలు మిమ్మల్ని ఏమీ చేయలేవు.
మేషరాశి
మేషరాశిలో శుక్ర సంచారం 11వ గృహంలో జరుగుతుంది. ఇది మేష రాశి వారికి శుభాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో మేషరాశి వారి చిరకాల కోరికలు తీరుతాయి. సంపద పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇది మేషరాశి వారికి అనుకూలమైన సమయం. వర్తక వ్యాపారాలు చేసే వారికి కూడా కలిసి వచ్చే సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications