మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు

ఏప్రిల్ 28వ తేదీ ఉదయం 7. 27 నిమిషాలకు మేషరాశిలో శుక్రుడు దహనం జరుగుతుంది. మేషరాశిలో శుక్రుడి దహనం వల్ల కొన్ని రాశుల వారు తీవ్రమైన ఇబ్బందులను, పెను సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగ జీవితంలో కూడా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేషరాశి
మేషరాశిలో శుక్ర దహనం మేష రాశి జాతకులకు అనుకూలంగా ఉండదు. మేషరాశి వారికి పని వత్తిడి విపరీతంగా పెరుగుతుంది. వృత్తికి సంబంధించిన విషయాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఆశించేవారు ఈ సమయంలో వాటిని పొందలేరు. ఈ సమయం మీకు ఎట్టి పరిస్థితులలోనూ అనుకూలంగా ఉండదు. పనిలో మీ కష్టాన్ని మీ ప్రయత్నాలను పై అధికారులు గుర్తించరు. ఈ సమయంలో మేష రాశి వారు ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది.

Venus combust in aries career challenges for these zodiac signs

వృషభ రాశి
వృషభ రాశి వారు మేష రాశిలో శుక్ర దహనం కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృషభరాశి జాతకులు ఈ సమయంలో ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు ఉద్యోగం చేసే చోట సీనియర్లు మీకు సమస్యలు సృష్టించే అవకాశం ఉన్నందున, వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. పనిలో పొరపాటున కూడా నిరాశ చెందకూడదు. ఓపిగ్గా అన్ని పనులు చేసుకోవాలి. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం కూడా కాస్త దెబ్బ తింటుంది.

కర్కాటక రాశి
మేష రాశిలో శుక్ర దహనం కారణంగా కర్కాటక రాశి జాతకులు ప్రతికూల ఫలితాలను చూస్తారు. పనిచేసే చోట ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగంలో మీరు ఎంత కష్టపడినా మీ పని పై అధికారుల మెప్పు పొందదు. ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్లు ఈ సమయంలో వచ్చే అవకాశం కూడా లేదు. చాలా కష్టపడి పనిచేసినా ప్రతికూల ఫలితాలు వస్తున్నాయని మీరు నిరాశకు గురయ్యే అవకాశం లేకపోలేదు.

కుంభరాశి
శుక్రుడి దహనం కారణంగా కుంభ రాశి జాతకులు ఈ సమయంలో ప్రతికూల ప్రభావాలను చూస్తారు. మీరు చేసే పనులలో తప్పులు జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు పూర్తి ఏకాగ్రతను, శ్రద్ధను పెట్టి పని చేయాల్సి ఉంటుంది. మీరు చేసే తప్పులకు మీరే భారీ మొత్తంలో మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఈ సమయంలో మీరు కెరీర్లో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

మీన రాశి
మేషరాశిలో శుక్ర దహనం మీన రాశి వారికి ఏ మాత్రం మంచిది కాదు. పనిచేసే చోట చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. సీనియర్ల నుండి సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. పనిచేసే చోట నుండి ప్రశంసలను పొందలేరు. ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్లు పొందడానికి అనుకూలమైన సమయం కాదు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+