పులిపంజా చీల్చి వీరు కుబేరులు అవుతున్నారు.. శనిరాశిలో ఉండి సెలవిచ్చిన శుక్రుడు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేయడంతో పాటు గ్రహాల సంయోగం కూడా అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తాయి. గ్రహాల సంయోగం కొన్ని శుభయోగాలను కొన్ని అశుభయోగాలను కలిగిస్తాయి. ఇక కొన్ని గ్రహాల రాశుల సంచారం కూడా ప్రత్యేకంగా ఉంటుంది.
కుంభరాశిలో శుక్ర సంచారం
సంపదలకు విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు శనీశ్వరుడు పాలించే కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. డిసెంబర్ 6వ తేదీన శుక్రుడు కుంభరాశిలో ప్రవేశించి జనవరి రెండవ తేదీ వరకు కుంభరాశి లోనే ఉండనున్నాడు. శనీశ్వరుడు పాలించే రాశి అయిన కుంభరాశిలో శుక్రుడు సంచారం ద్వాదశ రాశులవారి పైన ప్రభావం చూపిస్తుంది. కుంభరాశిలో శుక్రుడు సంచారం కారణంగా శుభస్థానంలో ఉన్న రాశుల వారికి విశేషమైన ఫలితాలను కలిగిస్తుంది.

మిధున రాశి
శుక్రుడు శని పాలించే కుంభరాశిలోనికి వెళ్లడం వలన మిధున రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మిధున రాశి జాతకులు ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. ఇది మిధున రాశి వారికి అన్నింట విజయాలను తెచ్చిపెడుతుంది.
వృషభ రాశి
శుక్రుడు శని పాలించే కుంభరాశిలో సంచారం చేయడం కారణంగా వృషభ రాశి జాతకులకు లబ్ధి చేకూరుతుంది. ఈ సమయంలో వృషభ రాశి జాతకులు యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగాలు చేసే వారికి పురోగతి లభిస్తుంది. వ్యాపారాలు చేసే వారికి కూడా ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో ఏ పని అనుకున్న కచ్చితంగా పూర్తవుతుంది.
మేష రాశి
శుక్రుడు కుంభరాశిలో సంచరించడం కారణంగా మేషరాశి జాతులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరు ఎటువంటి పనులు చేపట్టిన విజయం వరిస్తుంది . నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఇది మేషరాశి జాతకులకు అదృష్ట సమయం. వర్తక వ్యాపారాలు చేసే వారికి కూడా లాభాలు వస్తాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే లబ్ధి జరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications